Keerthi Suresh : చిరంజీవి పరువు తీసిన కీర్తి సురేష్.. అంత మాట అనేసిందేంటి భయ్యా..!

Keerthi Suresh : టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ సినిమాలతో పాటుగా మీడియాతో ముచ్చట్లు పెడుతుందన్న విషయం అందరికీ తెలుసు.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె తాను నటించిన హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగా కుర్ర హీరోలతో నటించడం గురించి చెబుతూ హీరోలను ఆకాశనికి ఎత్తేసింది. కానీ చిరంజీవి పరువును అడ్డంగా తీసేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే..

అసలు మ్యాటర్ ఏంటంటే.. తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. చిరంజీవి తన యూనిక్ స్టైల్‌తో అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాడు. చిరంజీవి డ్యాన్సులకు ఇప్పటికీ అందరూ ఫిదా అవుతుంటారు.. ఈ వయస్సు లో కూడా మాస్ స్టెప్పులను వేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు. అయితే తాజాగా చిరంజీవి డ్యాన్స్ గురించి కీర్తి సురేష్ ఒక ప్రశ్న ఎదురైంది. ఆమె మాట్లాడుతూ.. డ్యాన్స్‌లో ఎవరు బెస్ట్ అని విజయ్, చిరంజీవి పేర్లను ఆప్షన్లుగా ఇస్తే ఎవరైనా సరే చిరంజీవి పేరుని ఎంచుకుంటారు.. కానీ పాప మాత్రమే విజయ్ అని టక్కున చెప్పింది.. దాంతో మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

Keerthy Suresh insulted Chiranjeevi saying he can't dance
Vijay Deverakonda – Keerthy Suresh – Megastar Chiranjeevi

ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.. ఇక నెటిజన్స్ మాత్రం తనకు విజయ్ పై ప్రేమ ఉందేమో అందుకే ఆ పేరు చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మెగా యాంటి ఫ్యాన్స్ కీర్తి సురేష్ మెగాస్టార్ పరువు తీసేసిందని కామెంట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ కు నాని కొడుకు అంటే చాలా ఇష్ట మని చెప్పింది. ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో పెద్దగా అవకాశాలు తలుపు తట్టలేదు.. ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది.. ఒక్క సినిమా హిట్ అయితే అక్కడ స్టార్ ఇమేజ్ ను అందుకోవడం పక్కా అని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు