Puri – Charmy : ఇక్కడ అన్నీ ఇస్యూస్ పెట్టుకుని, ఇంకా ముంబైలోనే…

Puri – Charmy : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ఎనర్జిటిక్ హీరోస్ లో రామ్ ఒకరు. రామ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమాకి ఇప్పుడున్న అవంతరాలన్నీ ఇన్ని కాదు. ఈ సినిమాకి ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ కి క్లియర్ చేయాల్సిన అమౌంట్ ఉంది. అలాగే చాలా థియేటర్స్ తో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సినిమా రిలీజ్ రోజు దీనితో పాటుగా మిస్టర్ బచ్చన్ అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇకపోతే మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించి ప్రతిరోజు ఒక్కొక్క అప్డేట్ వస్తోంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా విషయానికి వస్తే కేవలం ట్విట్టర్లో కొన్ని పోస్టులు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు.

ఇక్కడ థియేటర్ గురించి మాట్లాడవలసిన పరిస్థితి పూరి జగన్నాథ్ కి ఉంది. సినిమా రిలీజ్ చాలా దగ్గర పడుతుంది. నిర్మాతగా చార్మి చాలా ఇష్యూస్ ను క్లియర్ చేయాల్సి ఉంది. అయినా గాని ఏమీ పట్టనట్టు ఇంక ముంబై నుంచి హైదరాబాద్ కి వీరిద్దరూ తిరిగి రాలేదు. అయితే ఇప్పుడు కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. అసలు డబల్ ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా ఆగస్టు 15 కి రిలీజ్ చేస్తారా లేదా అనే డౌట్ కూడా చాలామందికి వస్తుంది. పూరి జగన్నాథ్ సినిమా అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలానే ఒక సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది అంటే ప్రమోషన్స్ కూడా పీక్ లో ఉంటాయి ఈ రెండు ఈ సినిమాకి జరగట్లేదు.

Puri - Charmi

- Advertisement -

ఇకపోతే లైగర్ సినిమాతో చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధిస్తే వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి సామర్థ్యం ఛార్మికి పూరి జగన్నాథ్ కి వస్తుంది. అయితే ఈలోపే సినిమాకి ఎటువంటి అడ్డంకులు రాకుండా అన్ని దారులు క్లియర్ చేసుకోవాలి. ఇవి క్లియర్ అవ్వాలంటే ముంబై లో ఉండే అవ్వదు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే గాని రిలీజ్ సేఫ్ గా జరగదు. అలానే ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ థియేటర్స్ దొరికితే గాని మనీ రికవరీ కూడా అవ్వదు.

లైగర్ సినిమా పూరి జగన్నాథ్ కెరీర్ లో ఎంత లోతుకు తోసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు పూరి జగన్నాథ్ కెరీర్ లో చాలా సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి కానీ మరి ఇంత డిజాస్టర్ అంటూ మాత్రం లేదు. ఇప్పుడు మళ్లీ పూరీ జగన్నాథ్ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ ఇస్తాడు అని చాలామంది నమ్ముతున్నారు. ఏదేమైనా వీరిద్దరూ హైదరాబాద్ కు వచ్చి కనిపించి సినిమాను ప్రమోట్ చేస్తే ఆడియన్స్ థియేటర్ కి వస్తారు. నామమాత్రంగా అక్కడే ఉండి సినిమాని రిలీజ్ చేస్తామంటే పని జరగదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు