Geetu Royal: వారి వల్లే నా కొడుకు చనిపోయాడు.. ఫైర్ బ్రాండ్ ఎమోషనల్ వీడియో..!

Geetu Royal.. ప్రముఖ నటి బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా చేసి తనదైన గేమ్ తో అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా అద్భుతమైన గేమ్ స్ట్రాటజీతో అందరినీ ఆకట్టుకుంది. ఈమె ఆటకి బిగ్ బాస్ కూడా ఇంప్రెస్ అయిపోయాడు. హోస్ట్ నాగార్జున కూడా ఈమెను పొగిడేవాడు. ఒక దశలో గీతూ రాయల్ గేమ్ కేంద్రంగా బిగ్ బాస్ నడిపించాడు అంటే ఇక ఈమె పెర్ఫార్మన్స్ ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Geetu Royal: My son died because of them.. Fire brand emotional video..!
Geetu Royal: My son died because of them.. Fire brand emotional video..!

కన్నీటి పర్యంతమవుతున్న గీతూ రాయల్..

ఆ తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవ్వడంతో గీతూ రాయల్ పై ప్రేక్షకుల్లో వ్యతిరేకత మొదలయ్యింది. హోస్ట్ నాగార్జున హెచ్చరించినా సరే గీతూ వినిపించుకోలేదు. ఫలితంగా 9వ వారమే ఎలిమినేట్ అయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. టైటిల్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యి హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె 9 వారాలకే ఎలిమినేట్ అవ్వడం చూసి ఆమె తట్టుకోలేకపోయింది.. తనను హౌస్ నుంచి పంపించకండి అంటూ నాగార్జునను వేడుకుంది.. కానీ రూల్ అంటే రూల్ .. రూల్ ప్రకారం ఎలిమినేట్ అయితే వెళ్లిపోవాల్సిందే. ఇక పిఆర్ టీం లేకుండా హౌస్ లోకి వెళ్లి తప్పు చేశానని ఆవేదన చెందింది.. అంతే కాదు కొంతమంది సపోర్ట్ చేయలేదని బాధ పడింది కూడా .. కాకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి గీతూ రాయల్ బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా వ్యవహరించడం విశేషం.. బిగ్ బాస్ సీజన్ 7 లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసి కంటెస్టెంట్లకు ముచ్చెమటలు పట్టించింది. అలా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈమె తాజాగా కన్నీరు మున్నీరు అవుతూ ఒక పోస్ట్ పెట్టింది. ఈమె పెట్టిన పోస్ట్ అందరిని గుండెలవిసేలా ఏడిపించేసిందని చెప్పవచ్చు.

తన కొడుకు చనిపోయాడు అంటూ ఎమోషనల్ పోస్ట్..

గీతూ రాయల్ తన కొడుకును కోల్పోయింది. ఇంతకీ ఎవరా కొడుకు అంటే పెట్ క్యాట్.. చాలాకాలంగా గీతూ రాయల్ ఒక పెట్ క్యాట్ ను పెంచుకుంటుంది. దాని పేరు ఓరియో. హౌస్ లో కూడా ఈమె ఓరియో ను తలచుకొని ఎమోషనల్ కూడా అయింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు మించి ఆ పిల్లికి ఈమె ప్రాధాన్యత ఇచ్చేది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంది. కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంది. అయితే అలాంటి ఓరియో మరణించింది. ఓరియో మరణంతో తట్టుకోలేకపోయింది.

- Advertisement -

వారి నిర్లక్ష్యమే కారణం..

తనకు కొడుకు కంటే ఎక్కువ అని , తన కొడుకు మరణానికి సెక్యూరిటీ గార్డ్స్ నిర్లక్ష్యమే కారణం అంటూ ఆరోపించింది గీతూ రాయల్. తమ కమ్యూనిటీలోకి వీధి కుక్కలు వచ్చి ఓరియో మీద దాడి చేసి చంపేసాయని దీనికి సెక్యూరిటీ గార్డ్స్ బాధ్యత వహించాలి అంటూ సోషల్ మీడియాలో పంచుకుంది. ఓరియో కి స్నానం చేయించి, పొలంలో ఖననం చేసి అంత్యక్రియలు పూర్తి చేసింది గీతూ రాయల్ . ఇందుకు సంబంధించిన వీడియో ని కూడా పంచుకుంది. అందులో గుండెలు పగిలేలా ఏడుస్తోంది గీతూ రాయల్ . ఇకపోతే గత కొన్ని ఏళ్ళ క్రితం వికాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇంకా వీరికి పిల్లలు లేరు. అందుకే ఆవేదన వ్యక్తం చేస్తోంది గీతూ రాయల్. ప్రస్తుతం ఈ విషయం తెలిసి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు నెటిజన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు