VD12 release date : మైత్రిపై పంతం నెగ్గించుకోవడానికే… అందుకే ఈ డేట్ & ఈ అనౌన్స్మెంట్ ?

VD12 release date : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. శ్రీమంతుడు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చారు ఈ సంస్థ. అతి తక్కువ కాలంలోనే మంచి సినిమాలు చేసి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్ లో చాలా పెద్ద పెద్ద సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ బ్యానర్లో ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ బ్యానర్ నుంచి రావలసిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దీని కారణం ఇదే బ్యానర్ నుంచి ఇదివరకే రిలీజ్ అయిన పుష్ప సినిమా.

పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్పరాజ్ అనే క్యారెక్టర్నైజేషన్ చాలా మందికి పాయిజన్ లా ఎక్కింది. చాలామంది ఈ మేనరిజమ్స్ , ఈ డైలాగ్స్ ఎక్కడ పెడితే అక్కడ చాలా విరివిగా వాడారు. అయితే పుష్ప సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా సినిమాకు సంబంధించిన పనులు కొన్ని ఉండటం వలన డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లు మళ్లీ ప్రకటించారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ డేట్ నా పుష్ప 2 సినిమా రాదని తెలుస్తుంది. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత మార్చి 28న పుష్ప సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేసింది.

Vd12

- Advertisement -

ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ కి హారిక హాసిని క్రియేషన్స్ కి మధ్య కొద్దిపాటి వివాదాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే హారిక హాసిని బ్యానర్ కి అనుసంధానంగా ఉన్న బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ బ్యానర్ పై నాగ వంశీ సినిమాలు తీస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ బ్యానర్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న 12వ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు రిలీజ్ చేసింది సితార ఎంటర్టైన్మెంట్స్.

ఈ సినిమాకు గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అప్పటికి ఈ సినిమా పూర్తి కాకపోతే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే సినిమా అయినా కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మొత్తానికి మైత్రి పైన పంతాన్ని అలా నెగ్గించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ డేట్ వలన రెండు విషయాలు పైన క్లారిటీ వస్తుంది ఒకటి వీరిద్దరి మధ్య ఉన్న కొద్దిపాటి వివాదాలు. అలానే పుష్ప సినిమా కూడా వాయిదా పడినట్లు చిన్నగా క్లారిటీ వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు