VD12 First Look: విజయ్ ఫస్ట్ లుక్ సెన్సేషనల్ డైరెక్టర్ రెస్పాన్స్

VD12 First Look: విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రీసెంట్ టైమ్స్ లో విజయ్ ఒక హిట్ సినిమా చేసి చాలా రోజులు అయింది. టాక్సీవాలా సినిమా తర్వాత ఇప్పటివరకు విజయ్ కెరియర్లో సరైన హిట్ సినిమా పడలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇంక లైగర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొడతాడు అనే అందరూ ఊహించారు. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ కెరియర్ లో మంచి సినిమాలు లైనప్ లో పెట్టాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ దర్శకత్వంలో తన 12వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు రిలీజ్ చేశారు. అయితే ఇప్పటివరకు విజయ్ ను ఎవరు చూపించిన విధంగా ఈ సినిమాలో చూపిస్తున్నాడు గౌతం. చాలా షార్ట్ హెయిర్ తో గురైన గడ్డంతో రా & రస్టిక్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక నేడు రిలీజ్ అయిన ఈ పోస్టర్ చాలా మందికి ఆసక్తిని కలిగిస్తుంది. సినిమా కథ పైన కథాంశం పైన ఒక రకమైన క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అయితే ఈ పోస్టర్ పై స్పందించాడు సందీప్ రెడ్డి వంగ. ఎక్సైట్మెంట్ ఇంటెన్స్ ఫైడ్ లవ్ ఇట్ దేవరకొండ విజయ సాయి అంటూ ట్వీట్ చేశాడు.

- Advertisement -

లేకపోతే మామూలుగా సందీప్ రెడ్డి వంగ వర్క్ గురించి అందరికీ తెలిసిందే. తనేంటో మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటి దర్శకుడిని ఒక పోస్టర్తో ఇంప్రెస్ చేశాడు అంటే గౌతమ్ టాలెంట్ ఏంటో కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇదివరకే గౌతమ్ తీసిన మళ్లీ రావా జెర్సీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. మొదటిసారి విజయ్ కలిసి పనిచేస్తున్నాడు అనిరుద్. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు