Mr. Bachchan: “గోలేనా నీ గోత్రం” అనేది పక్కన పెడితే , సినిమా గురించి మాత్రం ఆడియన్స్ కి ఆత్రం

Mr. Bachchan: సమయం సందర్భం వచ్చినప్పుడు తెలుగు పాటని వినిపించాలి. అని డిసైడ్ అయిన చాలా అతి తక్కువ మంది దర్శకులలో మొదటి వినిపించే పేరు హరీష్ శంకర్. దానికి రిజల్ట్ గా “డీజే శరణం భజే భజే”, “అస్మైక యోగ” పాటలను ఎలా చెప్పుకుంటామో, ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ సినిమాలోని “జిక్కి” పాటను కూడా అలానే చెప్పుకోవచ్చు. ఇలాంటి పాటలను విన్నప్పుడే సేవ్ టైగర్స్, సేవ్ ట్రీస్ అని నినాదం చేసిన వాళ్ళలా సేవ్ లిరిసిస్ట్స్ అంటూ హరీష్ శంకర్ ఒక ముందడుగు వేసాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పాటలో ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ సాహిత్య రచయిత నుంచి రాబట్టారు.

అయినా ఇదంతా సాహిత్య రచయిత వనమాలి క్రెడిట్ కదా దీనిలో హరీష్ శంకర్ గొప్పతనం ఏముంది అని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంది, ఒక గొప్ప పాటను శ్రోతలకు వినిపించాలంటే ఒక గొప్ప ప్లాట్ఫారం కావాలి. అలానే ఒక గొప్ప సన్నివేశం కావాలి. అలాంటి గొప్ప ప్లాట్ఫామ్ సినిమా అయితే ఆ సినిమాలో వచ్చే సన్నివేశమే అటువంటి సాహిత్యాన్ని కోరుకుంటుంది. ఒక దర్శకుడు ఏమి చెబితే ఒక సాహిత్య రచయిత అంత అందమైన పదాల్ని అల్లి ఒక పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఒక అద్భుతమైన అనుభూతినిస్తాడు.? దర్శకుడుగా సాహిత్యం పైన హరీష్ శంకర్ కు ఒక అభిరుచి ఉండడం వలనే, చాలామంది సాహితీ ప్రియులకు ఈ పాటలో సాహిత్యం కూడా ఒక కొత్త రకమైన అనుభూతిని ఇస్తుంది అని చెప్పొచ్చు.

ఒక సెకను కి ఎన్ని నిమిషాలో

“ఒక సెకను కి ఎన్ని నిమిషాలో” అనే ఎక్స్ప్రెషన్ హరీష్ కి ఎంతలా నచ్చిందో. జిక్కీ పాటలో “తలగడులెరుగనీ తలపులు సొదలకు, తలపడుతున్న నిద్దురతో” అనే ఎక్స్ప్రెషన్ కూడా చాలామందికి నచ్చే అవకాశం ఉంది. అలానే ఈ పాటలో వనమాలి రాసినట్లు ” వింటున్నా నీ గాత్రం, ఏంటంటా నీ ఆత్రం, చూస్తున్న ఈ చిత్రం, గోలేనా నీ గోత్రం” అని వినగానే అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆత్రం ఆడియన్స్ కి పట్టుకోవడం ఖాయం. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ ఈ సినిమా పైన అంచనాలను పెంచుతూ ఉంది.

- Advertisement -

Mickey J Meyer

ఇక మిక్కీ జే మేయర్ విషయానికి వస్తే, రీసెంట్ టైమ్స్ లో చాలామంది తమకు ఒక పాట నచ్చినప్పుడు, ఒక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నచ్చినపుడు, ఏ బ్రాండ్ తాగి కొట్టావు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కామన్ గా మారిపోయింది. ఇక మిక్కీ విషయానికి వస్తే ఎంత సాఫ్ట్ మెలోడీస్ అందిస్తాడో, అంతే ఫాస్ట్ బీట్ సాంగ్స్ కూడా ఇవ్వగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే బహుశా ఆల్రౌండర్ అని మిక్కీ ను హరీష్ శంకర్ అంటూ ఉంటాడు. అసలు హరీష్ శంకర్ సినిమాలకు మిక్కీ ఏ బ్రాండ్ తీసుకుంటాడో అనాలనిపిస్తుంది. ఏదేమైనా ఒకవైపు ఆడియన్స్ కి కావలసిన మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు, సాహిత్య ప్రియులకు అనుభూతి కలిగించే అద్భుతమైన పాటలను అందించడం మాత్రం హరీష్ శంకర్ కి చెల్లింది అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు