OG Update : పవన్ ఫ్యాన్స్ కు ట్రీట్ సిద్ధం సిద్ధం , ఓజి అప్డేట్ ఇచ్చిన థమన్

OG Update : ప్రస్తుతం ఎస్ఎస్ తమన్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్, స్టార్ హీరో ప్రాజెక్ట్స్ కు సంగీతం అందిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న టాప్ ప్రాజెక్ట్స్ లో ఓ జి సినిమా ఒకటి. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇది ఒక గ్యాంగ్ స్టార్ సినిమాగా ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో కూడా అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక విజువల్ ట్రీట్ లా అనిపించింది.

ఆ గ్లిమ్స్ వీడియో తర్వాత ఓజీ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ డేట్ కి ఈ సినిమా వస్తుందో లేదో గ్యారెంటీ లేదు. అయితే ఈ తరుణంలో ఈ సినిమా గురించి ఫస్ట్ సింగల్ అప్డేట్ ఒక నెటిజన్ ట్విట్టర్ వేదిక అడిగాడు. దీనికి ఎస్ఎస్ తమన్ సమాధానం ఇస్తూ అతి త్వరలో మీ ముందుకి ఒక అప్డేట్ తో రాబోతున్నాము. నేను సుజిత్ కలిసి మీకోసం సంథింగ్ ఒక ట్రీట్ ని ప్లాన్ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan's OG

- Advertisement -

ఇక సుజిత్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయిన రోజుల్లో జై పవర్ స్టార్ అంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చిన వీడియోస్ ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి సుజిత్ కి పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది అంటేనే అది మామూలు విషయం కాదు. అటువంటి ఫ్యాన్ బాయ్ సుజిత్ కు పవన్ కళ్యాణ్ ను ఎలా వాడుకోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రీసెంట్ గా ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ కూడా ఓ జి సినిమా వస్తుంది చూద్దురుగాని అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ బేసిగ్గా తను చేసే సినిమాలు గురించి పెద్దగా మాట్లాడరు కానీ ఈ సినిమా గురించి మాట్లాడారు అంటే కచ్చితంగా కళ్యాణ్ కి కూడా ఈ సినిమా మీద కొంత ప్రేమ ఉందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు