Thiragabadarasamy Movie Review : ‘తిరగబడరసామి’ మూవీ రివ్యూ

Thiragabadarasamy Movie Review : రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “తిరగబడరసామి”. రాజ్ తరుణ్ పలు వివాదాల్లో చిక్కుకున్న తర్వాత వస్తున్న సినిమా కాబట్టి, పైగా ఈ సినిమాలో ఆ వివాదానికి కారణమైన మాల్వి మల్హోత్రా హీరోయిన్ గా నటించడం వల్ల ఈ సినిమాపై ఆడియన్స్ అటెన్షన్ పెరిగింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ :

గిరి (రాజ్ తరుణ్) ఓ అనాధ. చిన్నప్పుడు ఓ జాతరలో తల్లిదండ్రులకి దూరమవుతాడు. అందువల్ల అనాధగానే బస్తీలో పెరుగుతాడు. అతని పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు అని భావించి కుటుంబానికి దూరమైన వాళ్ళను… దగ్గర చేస్తుంటాడు. అందుకు తగ్గట్టు వాళ్ళ వద్ద డబ్బులు కూడా తీసుకుంటూ ఉంటాడు. గిరికి సంపాదన తక్కువ, పైగా బస్తీలో పెరిగిన కుర్రాడు. అందువల్ల అతనికి పిల్లనివ్వడానికి ఏ కుటుంబం ముందుకు రాదు.అక్కడ ఉన్న ఏ అమ్మాయి కూడా అతన్ని ఇష్టపడడు. అలాంటి టైంలో శైలజ (మాల్వీ మల్హోత్రా) అనే అమ్మాయి అతని జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్న టైంలో కొండారెడ్డి (మకరంద్ దేశ్‌పాండే) వీళ్ళ జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడు. శైలజకి, కొండారెడ్డితో సంబంధం ఏంటి? ఆమె గతం ఏంటి? గిరి భవిష్యత్తు ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది మిగిలిన కథ.

- Advertisement -

విశ్లేషణ :

‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి సూపర్ హిట్లు అందుకున్న ఏఎస్ రవి కుమార్ చౌదరి స్వతహాగా బాలకృష్ణ అభిమాని. ఆ పైత్యం వల్లే హీరోయిన్ బాలకృష్ణ అభిమాని అన్నట్టు చూపించాడు.అది ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ తో ‘జై బాలయ్య’ అనిపించడానికి పనికొచ్చింది. అది తప్ప సినిమాలో ఆకర్షించే ఎలిమెంట్ లేదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ఫస్ట్ హాఫ్ మొదటి 10 నిమిషాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చే ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ముందుగానే అంచనా వేసేసే విధంగా ఉంటుంది. ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ కొత్తగా ఏమీ ఉండదు. ఇక సెకండాఫ్ లో వచ్చే కొండారెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్..పరమ రొటీన్ గా అదే టైంలో వీక్ గా అనిపిస్తుంది. ఏ దశలోనూ సినిమా వేగం అందుకోదు. బ్యాక్ టు బ్యాక్ వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ చిరాకు తెప్పిస్తాయి. టెక్నికల్ గా మాత్రం పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మ్యూజిక్ కొంత వరకు ఓకే.

నటీనటుల విషయానికి వస్తే..

రాజ్ తరుణ్ కొన్ని సీన్స్ లో పర్వాలేదు అనిపించే విధంగా నటించాడు. కానీ యాక్షన్ సీక్వెన్స్ లో చాలా ఇబ్బందిపడ్డాడు. ఏదేమైనా ఎప్పటిలానే పాస్ మార్కులు వేయించుకున్నాడు. ఇక మాల్వీ మల్హోత్రా నటన పరంగా, గ్లామర్ పరంగా కూడా మెప్పిస్తుంది. సరైన పాత్రలు ఎంపిక చేసుకుంటే స్టార్ అయ్యే లక్షణాలు ఈమెకు ఉన్నాయి. లవ్ మేకింగ్ సీన్లో కూడా ఓ రేంజ్లో ఆకట్టుకుంది. మన్నారా చోప్రా నెగిటివ్ రోల్ చేసింది. ఓ సాంగ్లో గ్లామర్ వలకబోసింది. ఫేడౌట్ దశకి దగ్గరగా ఉందనే విషయాన్ని ముందే గ్రహించినట్టు ఉంది. అందుకే ఇలాంటి వ్యాంప్ పాత్ర లాంటిది ఒప్పేసుకున్నట్టు ఉంది. ప్రగతి, రాజా రవీంద్ర, 30 ఇయర్స్ పృథ్వీ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ వాళ్ళ పాత్రలు ఇంపాక్ట్ ఫుల్ గా ఉండవు. తాగుబోతు రమేష్.. వంటి కమెడియన్లు కూడా ఆకట్టుకునే విధంగా పెర్ఫార్మ్ చేయలేదు.

ప్లస్ పాయింట్స్ :

మాల్వీ మల్హోత్రా గ్లామర్

ప్రొడక్షన్ వాల్యూస్

ఒక గంట యాభై ఐదు నిమిషాలే రన్ టైం ఉండటం

మైనస్ పాయింట్స్ :

మిగిలినవన్నీ

మొత్తంగా..

‘తిరగబడరసామి’, దర్శకుడు ఏ వర్గానికి చెందిన ప్రేక్షకుల్ని టార్గెట్ చేసి ఈ సినిమా తీసాడో తెలీదు కానీ… వాళ్ళని కూడా ఆకట్టుకునే విధంగా అయితే ఈ సినిమా లేదు. హ్యాపీగా స్కిప్ కొట్టేయొచ్చు.

రేటింగ్ : 1/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు