Vd 12: అసలు ఏం ప్లాన్ చేశావ్ గౌతమ్, రెండు గెటప్స్ లో విజయ్

Vd 12: ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన కెరీర్ లో 12వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. లేకపోతే విజయ్ ని చాలామంది దర్శకులు చాలా రకాలుగా చూపించారు కానీ ఇప్పుడు గౌతమ్ చూపించిన విధానానికి మాత్రం అందరూ స్టన్ అయిపోయారు అని చెప్పొచ్చు. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమా ఫస్ట్ లుక్ పైన రియాక్ట్ అయ్యాడు. విజయ్ ను ఇలా చూడటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఒకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనూ, రెండు ఖైదీ పాత్రలో కూడా కనిపించనున్నాడు. ఇక ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే, ఖైదీ డ్రెస్ లోను మనం విజయ్ ను గమనించవచ్చు. ఇకపోతే ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ పోలీస్ గెటప్ లో విజయ్ ను చూపించారు. ఇదేమైనా టు గెటప్స్ లో విజయ్ ని చూపించడం అంటే మామూలు విషయం కాదు. దీనిని బట్టి ఖచ్చితంగా గౌతమ్ ఒక బ్లాక్ బస్టర్ రెడీ చేయబోతున్నాడని అర్థమవుతుంది.

Vd12

- Advertisement -

లేకపోతే రీసెంట్ టైమ్స్ లో విజయ్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన ఖుషి, పరశురాం దర్శకత్వంలో చేసిన ఫ్యామిలీ స్టార్ ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలిపోయాయి. వరుస డిజాస్టర్లు చూస్తున్న విజయ్ పర్ఫెక్ట్ గా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. వరుసుగా యంగ్ డైరెక్టర్స్ తో చేతులు కలుపుతూ అద్భుతమైన ప్రోజెక్ట్స్ ను తన లైనప్ లో పెట్టాడు. తర్వాత రాబోయే సినిమాలన్నిటి పైన కూడా మంచి అంచనాలు మొదలయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు