Allu Arjun Vs Sukumar: షూటింగ్ క్యాన్సిల్ , చేతులెత్తేసిన ప్రొడ్యూసర్స్

Allu Arjun Vs Sukumar: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులో పుష్ప 2 ఒకటి. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాని సుకుమార్ డిజైన్ చేసిన విధానం. పుష్పరాజ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన విధానం ఇవన్నీ కూడా ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని చాలా డైలాగ్స్ , మేనరిజమ్స్ ని చాలామంది క్రికెటర్స్ పొలిటికల్ లీడర్స్ బీభత్సంగా వాడటం వలన ఈ సినిమా ఇంకా ఇంకా పాపులర్ అయిపోయింది.

అందుకనే ఈ సినిమా సీక్వెల్ అయిన పుష్ప 2 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా గురించి రోజుకు ఒక న్యూస్ బయటపడుతూ వస్తుంది. అయితే వీటన్నిటికీ అల్లు అర్జున్ తో మంచి అనుబంధం ఉన్న బన్నీ వాసు ఎస్కేఎన్ వంటి నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఈ వార్తలు ఆగటం లేదు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం దర్శకుడికి అల్లు అర్జున్ కు మధ్య కొద్దిపాటి డిఫరెన్సెస్ వచ్చాయని అందుకోసమే ఈ రోజు షూట్ కూడా ఆపేసారని సమాచారం వినిపిస్తుంది. ఈరోజు షూటింగ్ ఆగిపోవడం వలన ప్రొడ్యూసర్ తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఎలా అని తీవ్ర ఆలోచనలో పడ్డారు ప్రొడ్యూసర్స్. ఇక ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ కి వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ లో కూడా వస్తుందో లేదో అని అనుమానాలు మొదలయ్యాయి.

Pushpa 2

- Advertisement -

ఈ సినిమాని ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత చాలా వేగంగా పనిచేశారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాకి సంబంధించి రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు. ఈ పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపుగా 100 మిలియన్ కు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. ఇకపోతే ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ క్రేజ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అల్లు అర్జున్ సినిమా వస్తుందేనంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం కూడా మొదలుపెట్టారు. అందుకోసమే ఏ మాత్రం అంచనాలుగు తగ్గకుండా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఏదేమైనా కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన కూడా పుష్ప సినిమాను మించి ఉంటుందంటూ చాలామంది చిత్ర యూనిట్ పలు రకాల ఇంటర్వ్యూస్ లో వీడియోస్ లో చెప్పుకుంటూ వస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు