OTT Movie : చేతబడితో కుప్పలు తెప్పలుగా డబ్బులు… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హార్రర్ మూవీ

OTT Movie : చేతబడి మీద వచ్చే సినిమాలు ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా టైంలో వచ్చిన పొలిమేర టాలీవుడ్లో ఈ ట్రెండుకు నాంది పలికింది. అప్పటి నుంచి అదే ట్రెండును ఫాలో అవుతూ విరూపాక్ష లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. పైగా పొలిమేర సీక్వెల్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ తో పొలిమేర 3 కంటిన్యూ కాబోతోంది. అయితే ఇలాగే చేతబడి ద్వారా కుప్పలు తెప్పలుగా డబ్బులు వచ్చిపడే మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? అసలు ఏ ఓటీటీలో ఉంది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు భాయి అజీబ్. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. భయపడేవాళ్లు, హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు ఈ సినిమాకు దూరంగా ఉంటే మంచిది. గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే ఈ సినిమాను చూడగలరు. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Watch Bayi Ajaib (2023) Full Movie Online - Plex

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

ఓ గ్రామంలో హీరోకి అడవిలో ఓ వజ్రం దొరుకుతుంది. ఆ వజ్రం ద్వారా అతను ఊహించని విధంగా పెద్ద ధనవంతుడుగా మారిపోతాడు. అదే ఊర్లో ఒక పెద్ద భవనాన్ని కొని అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్న తన భార్యతో అక్కడికి మూవ్ అవుతాడు. మరోవైపు అదే అడవిలో డోర్ మెన్ అనే వ్యక్తి వెతగ్గా, అక్కడ ఆల్బర్ట్ అనే ఒకతని సమాధిని కనిపెడతాడు. ఆ సమాధిని తవ్వి పుర్రెను ఇంటికి తీసుకెళ్తాడు. ఇక తనకు వచ్చిన మంత్ర తంత్రాలతో ఆ పుర్రెకు పూజలు చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు. అనుకున్నట్టుగానే పూజలు ఫలించి కట్టలు కట్టలుగా డబ్బులు ఓ సంచిలో నుంచి బయటపడతాయి. కానీ వెంటనే అవి ఆకులుగా మారిపోవడంతో అతనికి షాక్ తగులుతుంది.

ఈ క్రమంలోనే ఓ గొంతు అతనితో మాట్లాడుతూ డబ్బులు కావాలంటే తనకు బలి ఇవ్వాలని అడుగుతుంది. ఆ తర్వాత రోజు గ్రహణం ఉండడంతో ఆరోజు పిల్లలు ఆడవాళ్లు ఊర్లో నుంచి బయటకు వస్తే రాక్షసులు ఎత్తుకెళ్లిపోతారని భయపడతారు. అయితే అదే రాత్రి హీరో భార్య తన ప్రేగ్నేన్సి చెకప్ కి వెళ్లి అడవి మార్గం ద్వారా ఇంటికి పయనమవుతుంది. కానీ సడన్ గా ఆమె డోర్ మెన్ తవ్విన సమాధిలో పడిపోతుంది. అయితే ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన హీరో తనను కాపాడి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే ఆమె డెలివరీ కావడం, ఓ మూట ఆమె కడుపులో నుంచి బయటకు రావడం జరుగుతుంది. అందులోనే బిడ్డ ఉండడంతో బిడ్డపై గ్రహణం పడకుండా ఉండాలని కాసేపటి వరకు ఆ మూటను ఓపెన్ చేయరు. కానీ ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే అందులో ఓ తల ఉంటుంది. అసలు ఆ మూటలో ఉన్న వ్యక్తి ఎవరు? డోర్ మెన్ అనుకున్నట్టుగా డబ్బును సంపాదించగలిగాడా? అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు