Rajamouli: రెండో సినిమాతోనే మెగాస్టార్ కి పోటీ ఇచ్చాడు

Rajamouli: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోనే కాకుండా భారతీయ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరు అంటే డౌట్ లేకుండా ఎస్ ఎస్ రాజమౌళి పేరు చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఎస్ఎస్ రాజమౌళి కెరియర్ లో ఒక్క డిజాస్టర్ సినిమా కూడా పడలేదు. బేసిగ్గా ఆడియన్స్ పల్స్ తెలియాలి అంటారు. అది నిజమైతే రాజమౌళికి తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు అని ఒప్పుకోవాల్సిందే. మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చింది. కేవలం రాజమౌళి యొక్క స్థాయిని పెంచడమే కాకుండా భారతీయ సినిమా స్థాయిని కూడా పెంచింది.

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో సింహాద్రి అనే సినిమాను తెరకెక్కించాడు రాజమౌళి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అప్పట్లోనే ఒక పెను సంచలనం గా పేరు సాధించింది. అయితే ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ సినిమాలకు కూడా సింహాద్రి సినిమా గట్టి పోటీ ఇచ్చింది. ఆ టైంలో సింహాద్రి సినిమాను చూశారట మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమాను చూసి బాగా ఇంప్రెస్ అయిపోయారు. రెండవ సినిమాకే మెగాస్టార్ లాంటి హీరోని ఇంప్రెస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఆ సినిమా తర్వాత రాజమౌళిని పిలిపించి రామ్ చరణ్ ని లాంచ్ చేయమని చెప్పారట.

 Simhadri

- Advertisement -

ఇక చాలా సందర్భాల్లో ఎస్.ఎస్ రాజమౌళి మాట్లాడుతూ రామ్ చరణ్ తో మొదటి సినిమా చేయాలి. కానీ నేనే ఒప్పుకోకుండా రెండవ సినిమా చేస్తాను అంటూ చెప్పారు. దీనికి కారణంగా మొదటి సినిమా చిరంజీవి కొడుకు అని చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక ప్రెజర్ ఉంటుంది. దాని వలన సినిమాను నేను చేయలేదంటూ చెప్పారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో మగధీర అనే సినిమా వచ్చిన సంగతి తెలిసింది. ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తన రెండవ సినిమాతోనే బాక్సాఫీస్ షేక్ చేశాడు రామ్ చరణ్.

ఇక రాజమౌళి చేయని ప్రాజెక్టును పూరి జగన్నాథ్ చేశాడు. చిరుత సినిమాతో రామ్ చరణ్ ను లాంచ్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ అందుకున్నాడు. ఒక మదర్ సెంటిమెంట్ సినిమాను చరణ్ కోసం రాసి చరణ్ లోని అన్ని రకాల ఎమోషన్స్ వెండితెరపై ఆవిష్కరించేలా చేశాడు. అయితే మొదటి సినిమా తోని చరణ్ సరైన గుర్తింపును సాధించుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తండ్రికి తగ్గ తనయుడు దొరికాడు అని ప్రశంసలు పొందాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు