Trivikram: బన్నీ సినిమాతోనే త్రివిక్రమ్ పాన్ ఇండియా ఎంట్రీ, షూటింగ్ డేట్ కూడా సెట్

Trivikram: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. చాలామంది ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వాళ్ళు ప్రస్తుతానికి ఫేడ్ అవుట్ అయి వెళ్ళిపోతున్నారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అయితే ఇప్పుడు చాలామంది కొత్త దర్శకులు పాన్ ఇండియా కాన్సెప్ట్ సినిమాలు తీయటం మొదలుపెట్టారు. పురాణాలు వేదాలు మీద మినిమం నాలెడ్జ్ ఉన్న చాలామంది నేడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు త్రివిక్రమ్ ఒక పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు.

ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు పుష్ప సినిమాకి సీక్వెల్ లో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ 20వ తారీకుతో పూర్తికానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో భాగం కానున్నాడు అల్లు అర్జున్. అయితే త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాసు రీవిల్ చేశారు. పురాణాలు పైన వేదాలు పైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మంచి అవగాహన ఉంది. త్రివిక్రమ్ గారితో సినిమా అనేది ఫిక్సయింది షూటింగ్ కి వెళ్లే డేట్ కూడా కన్ఫర్మ్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
Allu Arjun, Trivikram Srinivas

ఇక త్రివిక్రమ్ సినిమాతో పాటు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ టైమ్స్ లో రెమ్యూనరేషన్ విషయంలో వీరి మధ్య కొంచెం తేడా వచ్చింది. ఈ ప్రాజెక్టు జరగట్లేదు అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇంకా ఈ ప్రాజెక్టు గురించి క్లారిటీ లేదు అట్లీతో సినిమా చేసే ప్రపోజల్ ఉంది అంటూ చెప్పారు బన్నీ వాసు. ఇక బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయ్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో చాలా పెద్ద సినిమాలు మధ్య ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు బన్నీ వాసు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు