Darling : ప్రియదర్శి సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది! ఎప్పుడంటే?

Darling : టాలీవుడ్ టాలెంటెడ్ కమెడియన్ కం హీరో ప్రియదర్శి హీరోగా నటించిన కొత్త సినిమా ‘డార్లింగ్’ గత నెల జులై 19న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కించాడు. ఇక చిన్న సినిమా అయినా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉండగా, థియేటర్లలో విడుదల అయ్యాక మాత్రం ఆశించిన రెస్పాన్స్ రాలేదు. కంటెంట్ బాగానే ఉన్నా, బోరింగ్ స్క్రీన్ ప్లే తో, రొటీన్ కామెడీ తో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. గతంలో వచ్చిన పలు సినిమాలకు కాపీ అంటూ ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే తొలి వీకెండ్ లో బాగానే పెర్ఫార్మ్ చేసిన డార్లింగ్ సినిమా తర్వాత కొత్త సినిమాల జోరుతో నెమ్మదించింది. ఇకపోతే డార్లింగ్ సినిమాకి సంబంధించి తాజాగా ఓటిటి స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది.

Darling movie will be streaming on Hot Star OTT from 13th August

డార్లింగ్ ఓటిటి రిలీజ్ ఆరోజునే!

డార్లింగ్ (Darling) సినిమాను థియేటర్లలో అంతగా పట్టించుకోని ప్రేక్షకులు ఓటిటి లోనే చూడాలని చాలామంది ఫిక్స్ అయ్యారు. సినిమా రిలీజ్ అయ్యాక టాక్ కూడా అంతగా రాకపోవడంతో ఒక్కసారైనా చూసే ప్రేక్షకులు, ఇక ఓటిటి లో చూద్దాం డబ్బులెందుకు దండగ అని ఫిక్స్ అయ్యారు. ఇక తాజాగా డార్లింగ్ సినిమా ఓటిటి రిలీజ్ అప్డేట్ వచ్చేసింది. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన డార్లింగ్ సినిమాను ప్రముఖ ఓటిటి సంస్థ అయిన డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ఆగష్టు 13 నుండి స్ట్రీమింగ్ కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక థియేటర్లలో విడుదలైన 25 రోజుల తర్వాత డార్లింగ్ సినిమా ఓటిటి లో విడుదల అవుతుంది.

- Advertisement -

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో బిజీ అయిన ప్రియదర్శి, నభా…

ఇక డార్లింగ్ సినిమా ప్లాప్ అయినా పెద్దగా పట్టించుకోకుండా ప్రియదర్శి తన తదుపరి సినిమాల్లో బిజీ అయ్యాడు. నటుడుగా, కమెడియన్ గా సక్సెస్ అయిన ప్రియదర్శి ఈ సినిమా ప్లాప్ అయినా అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ నభా నటేష్ వరుస పరాజయాల్లో ఉండగా, ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ సినిమా దెబ్బేసింది. ఏది ఏమైనా ముందుకెళ్లక తప్పదు కాబట్టి, తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇక నభా ప్రస్తుతం తెలుగులో స్వయంభూ లోనటిస్తుండగా, తమిళ్ లో ఓ సినిమా చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు