Mr Bachchan : మూవీలో రవితేజ ఎంట్రీ… మరి ఇంత ఓల్డ్ కాన్సెప్ట్ ఏంటి హరీష్?

Mr Bachchan: హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్లో మొదటి షాక్ అనే సినిమా వచ్చింది. సినిమా టైటిల్ లాగానే రిజల్ట్ కూడా షాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ మళ్లీ రచయితగా పనులు మొదలుపెట్టాడు. ఎన్నో ప్రయత్నాలు జరిగిన తర్వాత మళ్లీ రవితేజ మిరపకాయ్ సినిమాతో మరో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి బ్లాక్ బస్టర్ సాధించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతోనే దర్శకుడుగా ఇండస్ట్రీలో నిలబడిపోయాడు హరీష్ శంకర్.

అయితే వీరి కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా పై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే రిలీజ్ అయిన మూడు పాటలుకు కూడా మంచి ఆదరణ లభించింది. ఈ మూడు పాటలను సంగీత దర్శకుడు మిక్కిజే మేయర్ అద్భుతంగా కంపోజ్ చేశారు. అలానే ప్రతి సాహిత్య రచయితకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా వీడియో రిలీజ్ కూడా చేశాడు హరీష్. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో రవితేజ ఎంట్రీ సీన్ ఎలా ఉండబోతుందో తెలుస్తుంది.

Mr. Bachchan

- Advertisement -

ఈ సినిమాలో రవితేజ చేతక్ స్కూటర్ మీద ఎంట్రీ ఇస్తూ ప్రవీణ్ అవుతారు ఎంట్రీ తోనే ఫైట్ మొదలవుతుంది. రవితేజ చాలా ఓల్డ్ గెటప్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సీన్ ఎంతవరకు నిజముందో తెలియదు గానీ మరీ ఇంత ఓల్డ్ కాన్సెప్ట్ ఏంటి హరీష్ అంటూ కొందరు డిస్కషన్స్ కూడా మొదలుపెట్టారు.అయితే దీనిలో పెద్దగా డిస్కస్ చేయడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే చేతక్ స్కూటర్ మీద రవితేజ పిక్ తో అనౌన్స్ చేశారు. సో ఖచ్చితంగా ఎంట్రీ సీన్ ఇదే ఉండే అవకాశం కూడా ఉంది.

ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాతో భాగ్యశ్రీ తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ లో భాగ్యశ్రీ ఎనర్జీ ఏంటో అందరికీ అర్థం అయిపోయింది. ఇక థియేటర్లో ఈ సినిమా చూడడానికి చాలామంది ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ధమాకా తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మరో 100 కోట్ల సినిమా రాబోతుంది మిస్టర్ బచ్చన్ తో అనే అందరూ ఒక అంచనా వేస్తున్నారు. ఇక హరీష్ శంకర్ గద్దల కొండ గణేష్ సినిమా తర్వాత వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగు చాలా త్వరగా పూర్తి చేశాడు హరీష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు