Nagababu: సాయం చిన్నదే కావచ్చు, కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను

Nagababu: ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని కెరియర్లో ముందుకు వెళ్తున్నారు. ఒక మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా కొన్ని సినిమాల్లో నటుడుగా హీరోగా చేసి ఆ తర్వాత నిర్మాతగా కూడా అవతారం ఎత్తారు. నాగబాబు నిర్మాతగా చేసిన సినిమాలేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. నాగబాబుకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది అంటే ఈటీవీలో వచ్చిన జబర్దస్త్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రాం లో జడ్జిగా హాజరై చాలామందిని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేసేవాళ్ళు. అలానే నాగబాబు కూడా మంచి గుర్తింపు లభించింది.

ఒక మెగా ఫ్యామిలీలో ఏదైనా ఒక విషయం జరిగితే దాని గురించి ముందుగా రెస్పాండ్ అయ్యేది నాగబాబు మాత్రమే. ప్రతి విషయానికి రెస్పాండ్ అవుతూ ధీటైన సమాధానం ఇస్తుంటారు. ఇంక నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా మంచి పేరును సంపాదించుకున్నాడు. తన కెరీర్ లో వరుణ్ తేజ్ చేసినవి చాలా తక్కువ సినిమాలు అయినా కూడా, మంచి కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేశాడు. దీని గురించి ఆపరేషన్ వాలెంటైన్ అని సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడుతూ వరుణ్ మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయటం అనేది నాకు ఆనందాన్ని ఇస్తుంది అంటూ చెప్పారు.

Nagababu Konidela

- Advertisement -

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. అయితే ఆ తరుణంలో నాగబాబు ఒక మాట చెప్పారు. ప్రస్తుతం ఆ మాటను నిలబెట్టుకున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘ఆపరేషన్ వేలంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో AIR FORCE లో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకి నా వంతు సాయం చేస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాటకి గాను వారికి నేను 6 లక్షల సహకారం అందించాను. ఈ చిన్న సాయం పెద్ద గొప్పది కాకపోవచ్చు కాని ఇచ్చిన మాట మర్చిపోలేదన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. దేశ సేవలో ప్రాణాలర్పించిన వారికి తోడ్పాటు అందించే అవకాశం రావడం చాల అదృష్టంగా ఉందని తెలియజేశారు”

ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం అనేది మామూలు విషయం కాదు. చాలామంది చాలా మాటలు చెబుతుంటారు కానీ వాటినే నిలబెట్టుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడు పరిస్థితులు దాటడం కోసం హామీలు ఇవ్వడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కానీ అవి మాత్రం ఎప్పటికీ తీర్చని చాలామంది మనుషులు ఉంటారు. అయితే తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను అని ఒకసారి అందరికీ గుర్తు చేయడానికి నాగబాబు ట్విట్టర్లో ఈ విషయాన్ని షేర్ చేసినట్లు చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు