Ariana: అరియానా ప్రెగ్నెంట్.. షాకింగ్ న్యూస్ వైరల్..!

Ariana.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో రాజ్ తరుణ్ , ఆయన ప్రేయసి లావణ్య ల.ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లావణ్య రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా రిలేషన్ పై ఆశ్చర్యకర కామెంట్లు చేసింది.. ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ అరియానాను తెరపైకి తీసుకొచ్చి, పలు ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేయడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. లావణ్య అరియానా పై చేసిన కామెంట్లు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు అభిమానులను ఆగ్రహానికి కూడా గురిచేస్తున్నాయని చెప్పవచ్చు.

Ariana: Ariana Pregnant.. Shocking News Viral..!
Ariana: Ariana Pregnant.. Shocking News Viral..!

రాజ్ తరుణ్ అరియానాని ప్రెగ్నెంట్ చేశాడు…

తాజాగా లావణ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో రాజ్ తరుణ్ అరియానాను కూడా ప్రెగ్నెంట్ చేశాడు అంటూ బాంబు పేలిచింది. ఇప్పటికే మాల్వి మల్హోత్ర, రాజ్ తరుణ్ హోటల్ బుక్ చేసుకుని సహజీవనం చేస్తున్నారు , వీరు కలిసే ఉంటున్నారు అంటూ పలు రకాల కామెంట్లు చేసిన ఈమె, ఇప్పుడు అరియానా ని కూడా ప్రెగ్నెంట్ చేశాడు అంటూ సంచలన కామెంట్లు చేసింది. ఇక అరియానా పై లావణ్య ఇంత అబాండం వేయడంతో అరియానా అభిమానులు లావణ్య పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన ప్రెగ్నెంట్ ఎలా చేస్తాడు అంటూ లావణ్య ను ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై అరియానా ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

రాజ్ తరుణ్ పై లావణ్య అనుచిత వ్యాఖ్యలు..

గత కొన్ని నెలలుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుని , రెండుసార్లు కడుపు చేసి, ఆబార్షన్ కూడా చేయించాడంటూ ఆధారాలతో సహా బయటపెడుతూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది లావణ్య .అయితే ఇవన్నీ కూడా మీడియా ముందుకు రాకపోయినా ఎఫ్ఐఆర్ లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు రాజ్ తరుణ్ , మాల్వి మల్హోత్రా తో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే తనకు దూరంగా ఉన్నాడని, తన భర్త తనకు కావాలి అంటూ మీడియా ముందుకు వచ్చింది. అయితే లావణ్య ఇన్ని విషయాలు చెబుతున్నప్పటికీ రాజ్ తరుణ్ మాత్రం సైలెంట్ అయిపోయాడు.

- Advertisement -

క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్..

మొన్న జరిగిన పురుషోత్తముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రాజ్ తరుణ్ కనిపించలేదు.. దీంతో లావణ్య చెబుతున్నది నిజమే.. అందుకే రాజ్ తరుణ్ మీడియాని ఫేస్ చేయలేకపోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇక దీంతో ఎట్టకేలకు ఆగస్టు 2వ తేదీన విడుదల కాబోతున్న సందర్భంగా తన సినిమా తిరగబడరా స్వామి చిత్ర బృందం ఏర్పాటు చేసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రెస్ మీట్ లో.. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న మాల్వీ మల్హోత్రాతో కలిసి హాజరయ్యారు. ప్రెస్ మీట్ లో భాగంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. లావణ్యతో తనకు పెళ్లి జరగలేదని , లావణ్య కావాలని ఆరోపణలు చేస్తోందని, అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని క్లారిటీ ఇచ్చారు రాజ్ తరుణ్. నిన్నటి కి నిన్న లావణ్య క్రిమినల్ అని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని మాల్వి మల్హోత్రా కూడా తెలిపింది. మరి నిజా నిజాలు బయటపడడానికి ఇంకెంత సమయం పడుతుందో చూడాలి.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు