Ram – Balayya : ఈ మల్టీ స్టారర్ మూవీలో కన్నడ స్టార్… ఊహకు కూడా అందని కాంబో సెట్..?

Ram – Balayya : టాలీవుడ్ లో మెల్లిగా మల్టి స్టారర్ సినిమాల హవా ఊపందుకుంటుంది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్ తమ తోటిహీరోలతో ఎన్నో మల్టి స్టారర్ సినిమాలు చేసేవారు. కానీ 90స్ తర్వాత పూర్తిగా తగ్గిపోగా, ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో ఈ ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. పదేళ్ల కింద మహేష్ బాబు – వెంకటేష్ మల్టి స్టారర్ చేయగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ – వెంకటేష్ చేసారు. అయితే సమానమైన స్టార్ డమ్ యంగ్ హీరోల మల్టి స్టారర్ అంటే ఈ మధ్య వచ్చిన RRR అనే చెప్పాలి. రామ్ చరణ్ , ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఈ సినిమా ఇంపాక్ట్ మల్టి స్టారర్ లపై ఇంట్రెస్ట్ పెంచింది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా రామ్ పోతినేని – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో భారీ మల్టి స్టారర్ వస్తుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Kannada Star Shivaraj Kumar in Ram pothineni - Balakrishna Multi Starrer Movie

NBK – Rapo మల్టి స్టారర్ లోడింగ్..

అయితే టాలీవుడ్ లో గత కొన్ని రెండు రోజులుగా నటసింహం నందమూరి బాలకృష్ణ – రామ్ పోతినేని (Ram – Balayya) కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో మల్టి స్టారర్ సినిమా వస్తుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. సీనియర్ స్టార్ హీరో బాలయ్య, యంగ్ స్టార్ హీరో రామ్ పోతినేని కాంబో అనగానే ఇండస్ట్రీలో కూడా మంచి పాజిటివ్ బజ్ వచ్చేసింది. ఇక రామ్ – బాలయ్య కాంబో సినిమాను ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్ లోకి మరో స్టార్ హీరో కూడా ఎంటర్ అయ్యాడని తాజాగా వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

మల్టి స్టారర్ లో కన్నడ స్టార్..

ఇక రామ్ పోతినేని – బాలయ్య కాంబో మూవీ అనగానే ఇండస్ట్రీ లో భారీ క్రేజ్ నెలకొని ఉండగా, లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి మరో స్టార్ హీరో ఎంటర్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా రాపో- బాలయ్య సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జైలర్ లో మంచి రోల్ చేసిన శివన్న, త్వరలో రామ్ చరణ్ సినిమా సెట్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఇప్పుడు రామ్ – బాలయ్య సినిమాలో కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై ఊహకందని కాంబో సెట్ అయిందని, ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ, ఒక వేళ ఇది నిజమైతే టాలీవుడ్ లో ఊర మాస్ సినిమా లోడ్ అవుతుందని చెప్పొచ్చు. ఇక రామ్ – బాలయ్య సినిమాను పి. మహేష్ బాబు (MSMP ఫేమ్) డైరెక్ట్ చేస్తాడని, లేదా బోయపాటి శ్రీను తెరకెక్కించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు