Prabhas: ఎట్టకేలకు నిజం బయటకి.. ఆ హీరోయిన్ తో గొడవ.. పెళ్లికి దూరం..!

Prabhas.. పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898AD చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే మరో ఆరు చిత్రాలను ఆయన లైన్ లో పెట్టారు. ఇకపోతే ప్రభాస్ సినిమాల పరంగా విజయాలు సాధిస్తున్నప్పటికీ పెళ్లికి సంబంధించిన వార్త మాత్రం అభిమానులతో పంచుకోవడం లేదని చెప్పవచ్చు. ఇప్పటికే పెళ్లిపై ఎన్నో సందర్భాలలో విలేకరులు ప్రశ్నిస్తూనే వచ్చారు. కానీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు ప్రభాస్. ఇప్పటికే ఆయన పెళ్లి పై ఎన్నో రకాల పుకార్లు కూడా షికారు చేశాయి. అయితే ఈ వార్తలన్నింటికీ కూడా బ్రేక్ పడేలా చేశారు సీనియర్ జర్నలిస్ట్. తాజాగా ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Prabhas: Finally the truth is out.. Fight with that heroine.. Far from marriage..!
Prabhas: Finally the truth is out.. Fight with that heroine.. Far from marriage..!

ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆమె..

సినీ పరిశ్రమలో సీనియర్ జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఈమంది రామారావు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు.. రామారావు మాట్లాడుతూ.. ప్రభాస్ అనుష్కతో స్నేహం కంటే ముందే హీరోయిన్ త్రిష తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో పౌర్ణమి, వర్షం , బుజ్జిగాడు వంటి సినిమాలు కూడా వచ్చాయి. వీరి కెమిస్ట్రీకి సినిమాలు సూపర్ హిట్ అయ్యేవి. అదే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించింది. అలాగే ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ముఖ్యంగా త్రిషతో నిశ్చితార్థం చేసుకోవడానికి, ఆమె వేలికి ఉంగరం తొడగడం కోసం అత్యంత ఖరీదైన ఉంగరాన్ని కూడా ప్రభాస్ కొనుగోలు చేశారు.

త్రిష కారణంగానే ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు.

ఇక పెళ్లి చేసుకోబోతున్నారు అని అనుకునే లోపే ఎవరు ఊహించని రీతిలో వీరిద్దరూ విడిపోయారు. అయితే అలా విడిపోవడానికి గల కారణం త్రిష. ఎందుకంటే తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఈమె కోలీవుడ్ లో ఒక హీరోతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యింది.. అతనితో అంత సన్నిహితంగా ఉండడం ప్రభాస్ కి నచ్చలేదు. ఇదే విషయంపై ఆమెను మందలించారు కూడా. కానీ ఆమె వినలేదు. పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎంతో కొంత స్వేచ్ఛ ఉండాలనుకుంది త్రిష. కానీ ప్రభాస్ ఇలా మందలించడంతో నచ్చలేదట. దీంతో తన స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని భావించిన ఈమె ప్రభాస్ కు బ్రేకప్ చెప్పేసిందని తెలిపారు సీనియర్ జర్నలిస్ట్ . ముఖ్యంగా తన జీవితంలోకి వచ్చే అమ్మాయి అంత స్వేచ్ఛగా ఉంటే బాగుండదని భావించిన ప్రభాస్ అప్పటినుంచి దూరంగా పెట్టాడు అంతేకాదు పెళ్లికి కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు.

- Advertisement -

త్రిష కూడా ఒంటరి జీవితం..

మరొకవైపు త్రిష కూడా వివాహం చేసుకోలేదు. ఆమె కూడా ఒంటరిగానే జీవితాన్ని కొనసాగిస్తుంది. గతంలో ఒక వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న ఈమె అతడితో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. త్రిష కారణంగా ప్రభాస్ తన వైవాహిక బంధానికే దూరమయ్యారని చెప్పవచ్చు. మరొకవైపు త్రిష కూడా అంతే. మరి ఇద్దరు మళ్ళీ కలిసి ఒక్కటవుతారా లేక భవిష్యత్తులో విడివిడిగా అయినా పెళ్లి చేసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు