Gopichandh: 23 ఏళ్ల సినిమా ప్రస్థానం, నెగిటివ్ ఫ్యాన్ బేస్ లేని ఏకైక హీరో

Gopi chandh:  తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లో గోపీచంద్ ఒకరు. తొలివలపు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు గోపీచంద్. అయితే ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాలో విలన్ పాత్రలో కనిపించి ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వర్షం సినిమాలో కూడా విలన్ పాత్రలో కనిపించాడు. మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వం వహించిన నిజం సినిమాలో కూడా విలన్ గా కనిపించాడు. అయితే విలన్ గా ప్రూవ్ చేసుకున్న కొన్ని రోజుల తర్వాత హీరోగా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడు గోపీచంద్.

గోపీచంద్ చేసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇకపోతే ఇప్పటివరకు గోపీచంద్ కెరియర్ లో ఒక విషయంలో కూడా రిమార్క్ అంటూ లేదు అని చెప్పాలి. బెసిగా ప్రతి హీరోకి నెగిటివ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు కానీ గోపీచంద్ కు మాత్రం అలా లేరు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. చాలామందితో గోపీచంద్ కి మంచి అనుబంధం ఉంది. గోపీచంద్ వ్యక్తిత్వాన్ని చాలామంది ఎంతగానో ఇష్టపడతారు. ఇకపోతే గోపీచంద్ సినిమాలు కొన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా మంచి కాన్సెప్ట్ ఎన్నుకున్నాడు అని ప్రశంసలు మాత్రం పొందాడు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు గోపీచంద్ తన కెరియర్ లో చేశాడు. గోపీచంద్ చేసిన మొదటి సినిమా తొలివలపు సినిమా వచ్చి నేటికీ 23 ఏళ్లు అయింది.

Gopichand

- Advertisement -

ఈ 23 ఏళ్లలో గోపీచంద్ అనేక సినిమాలు చేశాడు. రీసెంట్ టైమ్స్ లో ఒక హిట్ సినిమా చేసి చాలా రోజులు అయింది అని చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలు కూడా కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇకపోతే ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్ లో విశ్వం అనే సినిమాను చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమాకు సంబంధించిన వీడియోను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే రీసెంట్ లో శ్రీను వైట్ల కూడా హిట్ సినిమా చేసి చాలా రోజులు అయింది. బాద్షా సినిమా తర్వాత సరైన హిట్ శ్రీను వైట్ల కెరియర్ లో పడలేదు ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఇక విశ్వం సినిమా గోపీచంద్ కి ఎంతగా ప్లస్ అవ్వనుందో కొంతకాలం వేచి చూసిన తర్వాత అర్థమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు