Adivisesh : ఏజెంట్ 116 రిపోర్టింగ్ కమింగ్.. స్టిల్స్ తోనే హైపెక్కిస్తున్నాడు!

Adivisesh : టాలీవుడ్ మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమాల్లో అడవి శేష్ నటిస్తున్న “G2” కూడా ఒకటి. అడవి శేష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “గూడచారి” సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో స్కై లెవెల్లో అంచనాలున్నాయి. విభిన్న శైలిలో సినిమాలు చేస్తూ వరుస హిట్లు అడవి శేష్ టాలీవుడ్ జేమ్స్ బాండ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి స్క్రిప్ట్ లతోనే సూపర్ హిట్లు కొడుతూ మీడియం రేంజ్ హీరోగా ఎదుగుతున్నాడు. క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో స్పై థ్రిలర్స్ కి కేరాఫ్ గా మారిపోయాడు. అయితే ప్రస్తుతం అడవి శేష్ నటిస్తున్న G2 మూవీపైనే మూవీ లవర్స్ కళ్లున్నాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు.

Adivisesh starrer G2 movie first look posters released

స్టిల్స్ తోనే హైపెక్కించిన గూఢచారి..

ఇక అడవి శేష్ గూఢచారి రెండో పార్ట్ తీస్తుండగా, పార్ట్ 1 ఎక్కడైతే ముగిసిందో, అక్కడి నుండే రెండో పార్ట్ కథ మొదలవుతుందని సమాచారం. ఇక ఫస్ట్ పార్ట్ కి అడవి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించగా, రెండో పార్ట్ కి కూడా అడవి శేషే స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా సాగుతున్నా పక్కా ప్లానింగ్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఇదిలా ఉండగా చాలా రోజుల తర్వాత G2 కి సంబంధించి అదిరిపోయే పోస్టర్లతో పలకరించాడు గూఢచారి. డిఫరెంట్ యాక్షన్ స్టిల్స్ తో కూడిన 6 పోస్టర్లని రిలీజ్ చేయగా, అందులో ఒక పోస్టర్ లో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కూడా ఉన్నాడు. ఆ పోస్టర్ చూస్తుంటే ఇమ్రాన్ హష్మీ గూఢచారి సహా ఉద్యోగి గా నటిస్తున్నాడని అనిపిస్తుంది. ఇక ఈ స్టిల్స్ తోనే సినిమాపై ఓ రేంజ్ హైప్ ఎక్కించాడని చెప్పొచ్చు.

- Advertisement -

ఏజెంట్ 116 రిపోర్టింగ్ ఆన్ డ్యూటీ 2025…

ఇక గూఢచారి లో ఏజెంట్ గోపి 116 గా అడివి శేష్ నటిస్తున్నాడు. ఇక ఫస్ట్ పార్ట్ కి పదింతలు రెండో పార్ట్ ఉంటుందని అడవి శేష్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్టే సినిమా భారీ తారాగణంతో స్టైలిష్ గా తెరకెక్కుతుంది. ఇక G2 పేరుతో తెరకెక్కుతున్న రెండో పార్ట్ కి వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బనిత సందు హీరోయిన్ గా నటిస్తుంది. గూఢచారి 2 షూటింగ్ ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తి కాగా, తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లతో G2 సినిమా 2025 లో వస్తుందని అనౌన్స్ చేసాడు. బహుశా సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు