AuronMein KahanDumTha : బాలీవుడ్ ని శాసించే హీరో.. క్లాసిక్ డైరెక్టర్.. కాంబోలో ఇంత చెత్త సినిమానా !

AuronMein KahanDumTha : బాలీవుడ్ లో ఈ ఇయర్ విడుదలైన సినిమాల్లో చాలా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. చిన్న సినిమాల వరకు పక్కన పెడితే, బడా స్టార్ హీరోలు నటించిన సినిమాలు సైతం ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేదు. హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ యావరేజ్ గా నిలవగా అజయ్ దేవగన్ సైతాన్ డీసెంట్ హిట్ అయింది. ఇవి తప్ప బీహార్ అంచనాలతో వచ్చిన ఎన్నో బడా సినిమాలు డిజాస్టర్లు గా మిగిలాయి. బడే మియా చోటే మియా, మైదాన్ వంటి సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. అయితే బాలీవుడ్ స్టార్ హీరోల ట్రాక్ రికార్డు కూడా ఎటు పోతుందో తెలీడం లేదు. మొన్నటికి మొన్న అక్షయ్ కుమార్ నటించిన భారీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ లో మరో స్టార్ అజయ్ దేవగన్ నటించిన కొత్త సినిమా ఊహించని దారుణమైన పరాజయాన్ని చవి చూస్తుంది.

AuronMein Kahan DumTha movie got disaster talk

మాస్ స్టార్.. క్లాసిక్ డైరెక్టర్.. ఒక చెత్త సినిమా..

బాలీవుడ్ ని శాసించే స్టార్ హీరోలలో అజయ్ దేవగన్ కూడా ఒకరు. ఖాన్ త్రయానికి పోటీనిచ్చే హీరోల్లో ఒకరైన అజయ్ దేవగన్ నుండి ఒకప్పుడు సినిమా వస్తుందంటే చాలు మాస్ ప్రేక్షకులు ఎగబడేవారు. కానీ కొన్నేళ్లలో ఈ హీరో చేస్తున్న సినిమాల్లో చాలా వరకు దారుణంగా ప్లాప్ అవుతున్నాయి. ఈ ఇయర్ సైతాన్ సినిమాతో డీసెంట్ సక్సెస్ కొట్టిన అజయ్ దేవగన్, అంత లోపే రెండు సినిమాలతో ఊహించని డిజాస్టర్లు అందుకున్నాడు. మైదాన్ మూవీ ఓవర్ డిలే వల్ల హిట్ వచ్చినా ప్లాప్ అయింది. అయితే తాజాగా స్టార్ డైరెక్టర్ తో ఒక చెత్త సినిమా చేసి ఊహించని విమర్శలు తెచ్చుకున్నాడు ఈ హీరో.

- Advertisement -

మాస్ హీరో సినిమాకి చెత్త వసూళ్లు..

బాలీవుడ్ లో బేబి, ధోని, స్పెషల్ చేబ్బీస్ వంటి సూపర్ హిట్ క్లాసిక్ సినిమాలు తీసిన డైరెక్టర్ నీరజ్ పాండే దర్శకత్వంలో అజయ్ దేవగన్ “ఔరోవ్ మే కహా దం తా” (Auron Mein Kahan Dum Tha) అనే సినిమా చేయగా, కొంచం డిలే అయిన ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ముందు నుండి ఈ సినిమాపై ఏమాత్రం అంచనాలు లేకపోగా, రిలీజ్ అయ్యాక కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ కథ తో చెత్త స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారని అంటున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురుచూసేలా చేసిన సినిమా ఇది అని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోకి సంబంధించి ఆల్ మోస్ట్ లోయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుని అత్యంత దారుణంగా నిరాశ పరిచడమే కాకుండా, చెత్త సినిమాగా టాక్ తెచ్చుకుంది. పైగా బై వన్ గెట్ వన్ టికెట్ ఆఫర్ పెట్టినా కూడా చాలా కష్టంతో ఫస్ట్ డే 1.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని దారుణమైన ఓపెనింగ్ అందుకుంది. ఇక ఈ వీకెండ్ లోనే సినిమాని తీసేయాలని బయ్యర్లు అనుకుంటున్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు