Nelson: దర్శకుడు కి కండిషన్ పెట్టిన ప్రముఖ బ్యానర్, తెలుగులో అవకాశం కోల్పోవచ్చు

Nelson: చాలా ఏళ్ల క్రితం దర్శకుడుగా ఒక సినిమాను మొదలు పెట్టి అప్పుడు వచ్చిన కొన్ని అడ్డంకులు కారణంగా సినిమాను మధ్యలోనే ఆపేశాడు నెల్సన్. మళ్లీ ఆరు సంవత్సరాల తర్వాత నయనతార ప్రధాన పాత్రలో కొలమావు కోకిల అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. డార్క్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ను సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత వరుణ్ డాక్టర్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు నెల్సన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బీస్ట్ సినిమా డిజాస్టర్ అయింది. అయితే అప్పటివరకు మంచి దర్శకుడుగా పేరు సాధించుకున్న నెల్సన్ ఒక ప్లాప్ సినిమా పడగానే చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికే సన్ నెట్వర్క్ సంస్థతో జైలర్ అనే సినిమాకు కమిట్ అయ్యాడు నెల్సన్. ఇక రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెల్సన్ కెరీర్ కు అది స్ట్రాంగ్ కం బ్యాక్ ఫిలిం అయింది. ఇకపోతే ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉంది నెల్సన్. దీని కోసమే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో జైలర్ సినిమాకి నిర్మాణం వహించిన సన్ నెట్వర్క్ సంస్థ జైలర్ 2 సినిమాని ముందుగా పూర్తి చేయమని చెప్పింది.

Jailer

- Advertisement -

జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ ని సగటు అభిమానులు ఎలా చూడాలి అని అనుకుంటున్నారు అలానే చూపించి 100% సక్సెస్ అయ్యాడు నెల్సన్. ఆ సినిమాకి కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం తమిళ నటులు మాత్రమే కాకుండా తెలుగు మలయాళం నుంచి కన్నడ నుంచి కూడా పెద్ద స్టార్ కాస్ట్ ను పెట్టి సక్సెస్ సాధించాడు నెల్సన్. ఈ సినిమాకి ముఖ్యంగా అనిరుద్ అందించిన మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. మొదటి పాటతోనే సినిమా పైన మంచి బజ్ క్రియేట్ చేయగలిగాడు అనిరుద్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిరుద్ పర్ఫామెన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు అది కూడా సినిమాకు కొంత మేరకు ప్లస్ అయింది. మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయి మంచి కం బ్యాక్ ఫిలిం అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు