Murari: అసిస్టెంట్ డైరెక్టర్ మురారి సెట్ లో మహేష్ ని పేరు పెట్టి పిలిస్తే ఏమన్నాడో తెలుసా

Murari: ప్రతి హీరో కెరియర్ లో మోస్ట్ మెమోర్బల్ సినిమా అంటూ ఒకటి ఉంటుంది. అలా మహేష్ బాబు విషయానికి వస్తే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా మోస్ట్ మెమోరబుల్ అని చెప్పొచ్చు. ఆ సినిమాతోనే మహేష్ బాబుకి మంచి బ్రేక్ వచ్చింది. ఆ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటికీ కృష్ణవంశీ కెరియర్ లో ఆ సినిమాకి ఒక కల్పు స్టేటస్ ఉంది. ఆ సినిమాకి మణిశర్మ అందించిన మ్యూజిక్ ఆ కథ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పటికీ ఆ సినిమా ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ చేస్తుంది.

ఇకపోతే కృష్ణవంశీ దర్శకత్వం వహించిన మురారి సినిమాకి ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ నందిని రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే తరుణంలో ఒకరోజు షూటింగ్లో భాగంగా షాట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మహేష్ బాబు ని పిలవమని కృష్ణవంశీ నందిని రెడ్డికి చెప్పారు. నందిని రెడ్డి మహేష్ బాబు దగ్గరికి వెళ్లి మహేష్ షార్ట్ రెడీ అని చెప్పింది. దానికి మహేష్ సెట్ దగ్గరికి వచ్చి ఏంటి మహేష్ అంటున్నావ్ అని నందినీ రెడ్డితో అన్నాడు. దానికి సమాధానంగా నందిని రెడ్డి ఇంకేమనాలి బాబు బేబీ అనాలా అని అన్నదంట. వెంటనే మహేష్ బాబు టక్కనే నవ్వారట. ఇంక మహేష్ బాబు విషయం గురించి చెబుతూ మహేష్ అంత సింపుల్గా తీసుకొని రావటం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు మహేష్ బాబు తో ఇప్పటికీ మంచి రిలేషన్ ఉంది అంటూ మాట్లాడింది నందినీ రెడ్డి.

Murari

- Advertisement -

ఇక నందిని రెడ్డి సినిమా కెరియర్ విషయానికి వస్తే కృష్ణవంశీతో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన తర్వాత అలా మొదలైంది సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకురాలుగా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన ఏంటో ప్రూవ్ చేసుకుంది నందిని రెడ్డి. అయితే అలా మొదలైంది తర్వాత ఆ స్థాయి హిట్ సినిమా ఇప్పటివరకు చేయలేకపోయింది నందిని. ఆ సినిమా తర్వాత చేసిన జబర్దస్త్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన కల్యాణ వైభోగమే ఓ బేబీ వంటి సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి. ఇక రీసెంట్ గా అన్నీ మంచి శకునంలే అనే సినిమాతో ఫ్రాక్షకులు ముందుకు వచ్చింది నందిని. ఈ సినిమా కూడా పరవాలేదు అని అనిపించుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు