Pushpa 2 : సీక్రెట్ రివీల్ చేసిన రష్మిక, అందుకే పుష్ప సినిమా డిలే అవుతుందా.?

Pushpa 2 : ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే కచ్చితంగా అదే డేట్ కి ఆ సినిమాను రిలీజ్ చేసే వాళ్ళు ఆయా దర్శక నిర్మాతలు. కానీ రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమాకు సంబంధించి కనీసం ఐదు ఆరు డేట్లు మారుతున్నాయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా పుష్ప 2. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా మరో సినిమా వస్తుందంటే అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా అప్పటికే సినిమాకు సంబంధించిన పనులు చాలా వరకు మిగిలి ఉండటం వలన ఈ సినిమాను డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ చేశారు.

ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు ఈ సినిమా నుంచి రెండు పాటలను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పుష్ప టైటిల్ సాంగ్ తో పాటు సెకండ్ సింగిల్ కూడా మంచి హిట్ అయింది. అయితే చూసేకి అనే పాటలు ఒక హుక్ స్టెప్ ఉంటుంది. ఆ హుక్ స్టెప్ లో కెమెరా లెన్స్ ని మ్యాచ్ చేస్తూ పూర్తి చేయాలి. మామూలుగా అది చాలా కష్టమైన పని. అయితే కేవలం ఆ స్టెప్పు కోసమే చాలా రోజులు పాటు షూటింగ్ చేశామని రష్మిక ఇండియన్ ఐడల్ 3 షో లో రివిల్ చేశారు. రష్మిక ఈ విషయం చెప్పగానే అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. ఇలా అయితే సినిమా షూటింగ్ లేటవ్వడంలో తప్పులేదు అని అందరికీ క్లారిటీ వచ్చింది.

Rashmika Mandanna

- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేసిన హీరోలు అందరూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు. అయితే రాజమౌళితో ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయకుండా సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా గురించి రోజుకు ఒక వార్త నెట్ లో వైరల్ అవుతుంది. దర్శకుడికి హీరోకి మధ్య గొడవలు జరుగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి సరైన క్లారిటీ ఎవరికి ఎప్పటి వరకు రాలేదు.

ఇక డిసెంబర్ 6న ఈ సినిమా వస్తుంది అని చాలామందికి నమ్మకం లేదు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ కూడా ఎవరికీ తెలియట్లేదు. ఈ సినిమా 2025 కి పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ ఒక కొలిక్కి వచ్చి షూట్ శరవేగంగా జరిగితే గాని అనౌన్స్ చేసిన డేట్ కు ఈ సినిమా రాదని చాలామంది ఊహిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు