Goat: సాంగ్ రిలీజ్ చేసినట్లు లేదు, మంచి ట్రోలింగ్ స్టఫ్ ఇచ్చినట్టు ఉంది

Goat: తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ దర్శకులలో వెంకట ప్రభు ఒకరు. కేవలం ప్లే బ్యాక్ సింగర్ గా, నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకొని, మంచి గుర్తింపును పొందుకున్నాడు. వెంకట ప్రభు 2007లో రిలీజ్ అయిన “చెన్నై 60028” అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత చేసిన సరోజ, గోవా, మంకంద, బిర్యాని, మనాడు వంటి చిత్రాలతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు వెంకట్ ప్రభు.

ప్రస్తుతం వెంకట్ ప్రభు విజయ్ తో ది గ్రేటెస్ట్ ఆల్ టైం అనే సినిమాని చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తలపతి విజయ్ రీసెంట్ గా నటించిన లియో సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా రాబట్టుకుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమా పైన అద్భుతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మామూలుగా ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు దర్శకుడికి ప్రశంసలు రావడం జరుగుతూ ఉంటుంది. అలానే మంచి లిరిక్స్ అందించారంటూ సాహిత్య రచయిత కూడా ప్రశంసలు దొరుకుతాయి. కానీ ఈ ఫస్ట్ సాంగ్ కి సంబంధించి విజయ్ ను బాగా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. పాటలోని కొన్ని విజువల్స్ కట్ చేసి చాలా దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ పరిణామాలు చూస్తుంటే ట్రోల్ చేయటానికి ఒక స్టఫ్ ఇచ్చినట్టు అయింది.

Vijay's 'The GOAT'

- Advertisement -

ఇక వెంకట ప్రభు మొదటి చిత్రం చెన్నై 600028 ఇది చెన్నైలోని సబ్బరన్ ప్రాంతంలోని ఒక గల్లీ క్రికెట్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో అతని సోదరుడు ప్రేమ్ జే తో పాటు 11 మంది కొత్తవారు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి సూపర్ హిట్ అయింది. మంచి సూపర్ హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.

వెంకట్ ప్రభు తెలుగులో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సినిమా మాత్రం కస్టడీ అని చెప్పొచ్చు. నాగచైతన్య నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. కానీ ఒక దర్శకుడుగా మాత్రం వెంకట్ ప్రభు కి మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మంచి హిట్స్ కూడా అయ్యాయి. మానాడు సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శింబు, ఎస్.జె. సూర్య నటించిన ఈ సినిమా చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పటికీ ఫేవరెట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా తెరకెక్కించాడు ఆ సినిమాని వెంకట్ ప్రభు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు