OTT Movie : ఉద్యోగం చేసే భార్యాభర్తలు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ… మస్ట్ వాచ్

OTT Movie : భార్యాభర్తల బంధం నేపథ్యంలో వచ్చే సినిమాలు ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయాయి అని చెప్పాలి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఇలాంటి కథ నేపథ్యం ఉన్న సినిమాలు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ ను యూత్ కు కలిగించాయి. ఈ జనరేషన్ ఆలోచనలను, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ లో ఉండే భార్య భర్తల అగచాట్లను డైరెక్టర్ తెరపై అద్భుతంగా చూపించాడు. ఇక ఈరోజు మనం మూవీ సజెషన్ కూడా అలాంటిదే. పెళ్లి జరిగాక కూడా ఉద్యోగరీత్యా దూరంగా ఉండే భార్యాభర్తల బంధం లో ఎలాంటి సమస్యలు వచ్చాయి? అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు? మూవీ పేరేంటి అనే విషయాలను చూసేయండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ అందమైన భార్య భర్తల బంధానికి సంబంధించిన మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ పేరు మీనాక్షి సుందరేశ్వర్. ఇప్పటికే చాలామంది ఈ సినిమాను చూసేసి ఉంటారు. అయితే ప్రస్తుతం తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది మీనాక్షి సుందరేశ్వర్. ఒకవేళ ఇప్పటిదాకా ఈ సినిమాను ఇంకా చూడకపోతే వెంటనే ఈ వీకెండ్ చూసేయండి.

Movie Reviews | Meenakshi Sundareshwar, a unique love story? - Telegraph India

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

మీనాక్షి అనే అమ్మాయి ఇందులో హీరోయిన్. ఆమెకు రజనీకాంత్ సినిమాలు అంటే ఎంత ఇష్టం అంటే ఏకంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూ ఈలలు వేసి గోల చేయాల్సిందే. అలాంటి అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటారు తల్లిదండ్రులు. అందులో భాగంగానే ఓ రోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ సుందరేశ్వర్ అనే హీరోను పరిచయం చేస్తారు. అతనికి బీటెక్ చదివినా ఉద్యోగం రాదు. పైగా తన తండ్రికి ఓ బట్టల షాప్ ఉంటుంది. అందులోనే అతన్ని కూడా పని చేయమంటారు. కానీ తనకు ఆ పని చేయడం ఇష్టం ఉండదు. ఉద్యోగం తెచ్చుకునే లోపే ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లికి ఫోర్స్ చేసి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. ఇక సుందరేశ్వర్ ఫ్యామిలీతో కలిసి పెళ్లి చూపులకు మీనాక్షి ఇంటికి వెళతాడు. ఆ తర్వాత రాంగ్ అడ్రస్ కు వచ్చామని విషయం తెలుస్తుంది. కానీ మొదటి చూపులోనే హీరో హీరోయిన్ ఇద్దరూ ప్రేమలో పడడంతో పెళ్లి జరుగుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి ఇద్దరూ కాస్త క్లోజ్ అవుతున్న సమయంలోనే సుందరేశ్వర్ కు జాబ్ వస్తుంది. అయితే తన కంపెనీ బ్యాచిలర్స్ కి మాత్రమే ఉద్యోగం ఇస్తుందని తెలియడంతో అతను బ్యాచిలర్ గా నటిస్తూ బెంగళూరులో జాబ్ చేస్తాడు. మీనాక్షిని తన తల్లిదండ్రుల దగ్గరే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ అత్తగారింట్లో మీనాక్షికి గొడవలు స్టార్ట్ అవుతాయి. అసలే లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న మీనాక్షి సుందరేశ్వర్ మధ్య ఈ గొడవలు అపార్థాలకు దారి తీస్తాయి. మరి చివరికి వీరిద్దరూ కలిశారా? సుందర్ తన జాబ్ ను అలాగే కంటిన్యూ చేశాడా? ఈ జంట దాంపత్య జీవితం ఎలా సాగింది? అనే విషయాలు తెలియాలంటే మీనాక్షి సుందరేశ్వర్ అనే మూవీని ఓటిటిలో చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు