Game Changer : బాబోయ్.. ఇంకా నాలుగు రోజులు షూటింగ్ అట.. వీరిపై కీలక సీన్లు షూట్..

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ దాదాపు ముగిసిపోయిందని చిత్ర యూనిట్ పలుమార్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు శంకర్ గాని, దిల్ రాజు గాని రామ్ చరణ్ కి సంబంధించిన షూట్ మొత్తం ఫినిష్ అయిందని, మిగతా చిన్న చిన్న టాకీ పార్ట్ ఓ పది రోజులు మాత్రమే బాకీ ఉందని చెప్పుకొచ్చారు. మరి కేవలం అన్ని రోజులే షూటింగ్ అంటే దసరా కి గేమ్ ఛేంజర్ ని తీసుకురావచ్చు కదా అని చరణ్ ఫ్యాన్స్ అంటుంటే, దిల్ రాజు మాత్రం క్రిస్మస్ కి కలుద్దాం అనేశాడు. దీంతో మెగాభిమానులకు మళ్ళీ డౌట్లు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా ఉందని అంటున్నారు నెటిజన్లు. ఇక రీసెంట్ గానే రెండు రోజుల కింద రామ్ చరణ్ మళ్ళీ షూటింగ్ లో పాల్గొననట్టు సమాచారం తెలిసిందే. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ షూటింగ్ కి సంబంధించి సమాచారం వచ్చింది.

Game Changer Movie Latest Shooting Update

ఇంకా నాలుగు రోజుల సీన్లు షూట్…

తాజాగా అందిన సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ (Game Changer) షూటింగ్ ఇంకా నాలుగు రోజులు బాకీ ఉందట. అది కూడా కన్ఫర్మేషన్ తెలీదు. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఇక ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. లింగం పల్లి, గోపంపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ మంగళవారం నుండి వరుసగా 4 రోజుల పాటు షూటింగ్ జరుపనున్నారట. ఇక ఈ షెడ్యూల్ లో సముద్రఖని, శ్రీకాంత్, శుభలేఖ సుధాకర్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. మరి ఇవి పూర్తయిన తర్వాతైనా ప్రమోషన్లు స్టార్ట్ చేస్తారో లేదో చూడాలి.

- Advertisement -

క్రిస్మస్ కి పక్కాగా ప్లాన్..

ఇక గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కోసం చరణ్ అభిమానులు రెండేళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక దిల్ రాజు మాత్రం క్రిస్మస్ కు గేమ్ ఛేంజర్ ని విడుదల చేస్తానని అంటున్నా ఓ వైపు డౌట్ గానే ఉంది. అయితే గేమ్ ఛేంజర్ కి లాంగ్ రన్ అవసరం కాబట్టి, నవంబర్ కి తీసుకువస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర, సునీల్, ఎస్.జె. సూర్య శ్రీకాంత్, రాజీవ్ కనకాల, సముద్రఖని వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇక థమన్ ఈ సినిమా కోసం ఏకంగా ఏడు అద్భుతమైన పాటలు రెడీ చేస్తున్నాడు. మరి రిలీజ్ డేట్ ని ఆఫీసియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు