Vaishnavi Chaitanya: షార్ట్ ఫిల్మ్ నుండి ఫిలిమ్ ఫేర్ వరకు

Vaishnavi Chaitanya: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ నిలబడటం అనేది సాధారణమైన విషయం కాదు. కొంతమంది తెలుగు హీరోయిన్స్ వచ్చినా కూడా కొన్ని సినిమాలు చేసి కనుమరుగైపోతున్నారు. వచ్చిన అవకాశాన్ని వాడుకొని మంచి కథలను ఎన్నుకొని కెరీర్లో ముందుకు వెళితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుందని కచ్చితంగా చెప్పొచ్చు. ఇకపోతే షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసింది వైష్ణవి చైతన్య. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ అనే సినిమాలో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇక వైష్ణవి చైతన్య మొదటి సినిమాతోనే మంచి పేరును సాధించుకుంది. అయితే బేబీ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వడం మాత్రమే కాకుండా అవార్డులను కూడా సొంతం చేసుకుంటుంది. మొదటి ఈ సినిమాకి కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా కూడా అవేమీ సినిమాపై ఎఫెక్ట్ చూపించలేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్స్ గా వైష్ణవి చైతన్యకు ఫిలింఫేర్ అవార్డు ఈ సినిమాకు వచ్చింది. మంచి పేరుతో పాటు అవార్డు కూడా రావడం అనేది రేర్ గా జరుగుతుంది. షార్ట్ ఫిలిమ్స్ దగ్గర కెరియర్ మొదలు పెట్టిన వైష్ణవి నేడు ఫిలింఫేర్ అందుకునే స్థాయికి వచ్చింది.

Baby

- Advertisement -

బేబీ సినిమా తర్వాత వైష్ణవికి వరుస అవకాశాలు వచ్చాయి. రీసెంట్గా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో లవ్ మీ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది వైష్ణవి. వైష్ణవి ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. సిద్దు జొన్నలగడ్డ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. గుంటూరు టాకీస్ అనే సినిమాతో తనలో ఉన్న రైటర్ ను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత సిద్దు రాసిన ఎన్నో సినిమాలు డీసెంట్ హిట్ అనిపించి ఉన్నాయి తప్ప బ్రేక్ ఇవ్వలేదు. డి జె టిల్లు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు సిద్దు. ఇప్పుడు సిద్దు సరసన వైష్ణవి నటిస్తుందని అంటే రాబోయే సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు