Sangeeth Sobhan : వర్త్ వర్మ, బెస్ట్ యాక్టర్ గా సంగీత్ శోభన్

Sangeeth Sobhan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో సంగీత్ శోభన్ ఒకరు. జీ 5 ఫైవ్ లో ప్రసారమైన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సినిమాతో చాలామందికి పరిచయం అయ్యాడు సంగీత్ శోభన్. అక్కడితోనే మంచి పేరును సాధించుకున్నాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి ఎనర్జిటిక్ హీరో దొరికాడు అని అనిపించుకున్నాడు. అయితే కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన మ్యాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. ఆ సినిమాలో సంగీత్ శోభన్ పెర్ఫామెన్స్ వేరే రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.

మొదటి సినిమాతోనే అందర్నీ విపరీతంగా ఆకర్షించాడు సంగీత్. ప్రస్తుతం ఫిల్మీ ఫెయిర్ అవార్డ్స్‌లో  సంగీత్‌కి బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. సంగీత్ కి ఈ అవార్డు రావడం అనేది ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే సంగీత్ టాలెంట్ ఏంటో ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. అందుకే ఇప్పుడు సంగీత్ కి అవార్డు రావడంతో అందరికీ వర్త్ అని అనిపిస్తుంది. సంగీత్ సోదరుడు సంతోష శోభన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చిన్న ఏజ్ లోనే వీళ్లిద్దరూ సినిమాల్లోకి అరంగేట్రం చేశారు.

Mad

- Advertisement -

సంతోష్ శోభన్ ఫాదర్ శోభన్ మంచి దర్శకుడు. ప్రభాస్ నటించిన వర్షం సినిమాకి దర్శకత్వం వహించారు శోభన్. అందుకే సంతోష్ ఓపెన్ పైన ప్రభాస్ కి ఒక కన్సర్న్ ఉంటుంది. సంతోష్ శోభన్ సినిమా అంటే ప్రభాస్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇక సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ ఇద్దరు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి కాన్సెప్ట్ సినిమాలు ఎన్నుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకుంటున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అన్ని మంచి శకునములే అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు సంతోష్ శోభన్. ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు