Vishwambhara : విశ్వంభర కోసం స్టైలిష్ యాక్షన్ కొరియోగ్రాఫర్!

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర” సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సంక్రాంతికి ఎలాగైనా తీసుకురావాలనే లక్ష్యంతో నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా 70 శాతానికి పైగా పూర్తవగా, కాస్త గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నారు. చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా కావడంతో విశ్వంభర సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక సినిమాకి బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా విశ్వంభర నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Action Choreographer Anlarasu entry for Vishwambhara movie

విశ్వంభర కోసం స్టైలిష్ యాక్షన్ కొరియోగ్రాఫర్…

ఇక విశ్వంభర (Vishwambhara) సినిమాకి సంబంధించి అన్ని అంశాల్లో కూడా మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తుండగా, తాజాగా చిత్ర యూనిట్ నుండి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ అయిన, క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ “అన్లారసు” ని రంగంలోకి దింపినట్టుగా మేకర్స్ తాజాగా తెలిపారు. ఆల్రెడీ సెట్స్ లో అడుగుపెట్టిన అన్లారాసు సీక్వెన్స్ కోసం డైరెక్టర్ వశిష్ఠతో కలిసి అదిరిపోయే సెట్స్ ని రెడీ చేస్తున్నారు. ఇక ఈ యాక్షన్ డైరెక్టర్ ఇండియా వైడ్ గా ఎన్నో భారీ సినిమాలకు పనిచేసాడు. శంకర్ తెరకెక్కించిన “ఐ” సినిమాతో పాటు బాలీవుడ్ భారీ చిత్రాలు జవాన్, తెలుగులో రామ్ చరణ్ బ్రూస్ లీ ఇంకా పాన్ ఇండియా వైడ్ గా ఎన్నో చిత్రాలకి సాలిడ్ యాక్షన్ అందించగా, ఇప్పుడు విశ్వంభర కోసం అదిరిపోయే సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నాడు.

- Advertisement -

పక్కాగా సంక్రాంతికి రిలీజ్…

ఇక విశ్వంభర సినిమాని పక్కాగా సంక్రాంతికే రిలీజ్ చేయాలనీ, చిరు స్ట్రాంగ్ గా ఫిక్సయ్యాడని తెలుస్తుంది. పైగా సంక్రాంతికి బాలకృష్ణ, వెంకటేష్ కూడా వస్తుండడంతో వచ్చే ఏడాది సంక్రాంతి సీనియర్ల సమరంగా రంజుగా ఉండనుంది. 10 జనవరి 2025లో విశ్వంభరని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న మేకర్స్ చిరంజీవి బర్త్ డే కి టీజర్ రిలీజ్ చేసి అప్పటి నుండి ప్రమోషన్లు స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ రంగనాథ్, ఇషా చావ్లా, సురభి వంటి హీరోయిన్లు చిరు చెల్లెళ్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు