DoubleiSmartTrailer : ఉస్తాద్ శంకర్.. అలియాస్ “డబుల్ ఇస్మార్ట్”.. ఈసారి పోట్టెల్ పెద్దదే..

DoubleiSmartTrailer : రామ్ పోతినేని పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత వచ్చిన ఊర మాస్ సినిమా కావడంతో మాస్ ఫ్యాన్స్ ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఇటు పూరి కి, అటు రామ్ కి సాలిడ్ మాస్ కం బ్యాక్ ఇచ్చింది ఆ సినిమా. రాపో సరికొత్త మాస్ అవతార్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఐదేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్” సినిమా తెరకెక్కింది. అసలు ఈ సినిమా సీక్వెల్ అనౌన్స్ అయినప్పుడే సినిమాపై భారీగా అంచనాలు పెరగగా, దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా భారీ తారాగణంతో పాన్ ఇండియా రేంజ్ లో సీక్వెల్ ని తెరకెక్కించాడు. ఇక ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ ట్రైలర్ కాసేపటికిందే రిలీజ్ అయి ట్రెండ్ అవుతుంది.

Doublei Smart Movie Trailer Talk

మార్ ముంతా చోడ్ చింతా.. డబుల్ కిక్…

ఇక కాసేపటికిందే రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ట్రైలర్ స్టార్ట్ అవడంతోనే రామ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అదిరిపోయే ఎంట్రీ ఇవ్వగా, తన మాస్ డైలాగ్స్ తో ప్రతి ఫ్రేమ్ లో ఇస్మార్ట్ శంకర్ ని గుర్తు చేసాడు. ఈ సినిమా ట్రైలర్ లో అదే పాత్రతో ఎంట్రీ ఇచ్చిన శంకర్, మొదటి సినిమాకి సంబంధం లేకుండా లైఫ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ లో మైండ్ కి చిప్ పెట్టే కాన్సెప్ట్ తోనే రెండో పార్ట్ కూడా నడుస్తుందని చూపించారు. కథ నేపథ్యం ముంబైకి షిఫ్ట్ అయిందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తుండగా, తన రోల్ కూడా స్ట్రాంగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ట్రైలర్ చూడ్డానికి రిచ్ గా ఉండగా, క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎక్కడా తగ్గకుండా భారీగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది.

- Advertisement -

ఈసారి పొట్టెల్ పెద్దదే…

ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించగా నటించగా, సంజయ్ దత్, అలీ, షాయాజీ షిండే, గెటప్ శీను, మకరంద్ దేశ్ పాండే, ప్రగతి వంటి వారితో స్టార్ క్యాస్ట్ కూడా బాగా ఉంది. ఇక డబుల్ ఇస్మార్ట్ కి కూడా మణిశర్మ సంగీతం అందిస్తుండగా, ట్రైలర్ కి ఇచ్చిన బీజీఎమ్ కూడా బాగుంది. ఇక డబుల్ ఇస్మార్ట్ మూవీలో మాస్ కి ఏమాత్రం కొదవ లేకుండా అన్ని మసాలాలు దింపేసినట్టు తెలుస్తుంది. ఇక డబుల్ ఇస్మార్ట్ ని పూరిజగన్నాథ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి డబుల్ ఇస్మార్ట్ ని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఆగష్టు 15న పొట్టెల్ జాతరకు రెడీ అవుతున్న డబుల్ ఇస్మార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు