Balakrishna : ఫ్రెండ్షిప్ పై నటసింహం బాలయ్య అన్స్టాపబుల్ మెసేజ్..

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటసార్వభౌమ ఎన్టీఆర్ వారసుడిగా సీనియర్ అగ్ర హీరోలలో ఒకరిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇప్పటి యంగ్ హీరోలకు కూడా పోటీనిస్తున్న బాలయ్య రాజకీయాల్లోనూ రానిస్తూ వరుసగా మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టించాడు. ఇక సాయంలోనూ ఎప్పుడూ ముందుండే బాలకృష్ణ తన తల్లిపేరిట బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి ఎంతోమంది ప్రజలకు సేవ అందిస్తున్నాడు. ఇక బాలయ్య సినిమాల్లో కాకుండా బయట ఎంతో రియాలిటీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముక్కుసూటిగా మాట్లాడే బాలయ్య తత్త్వం అందరికి ఇష్టం. ఇదిలా ఉండగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్బంగా బాలకృష్ణ ఓ సందర్భంలో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Balakrishna Talk about Friendship

ఇక బాలకృష్ణ (Balakrishna) రెండేళ్లుగా ఆహా ఓటిటి లో అన్ స్టాపబుల్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య 2.0 గా ఇక్కడినుండే కం బ్యాక్ ఇచ్చారని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ షో లో ఓ సందర్భంలో ఫ్రెండ్షిప్ డే నాడు, ఫ్రెండ్షిప్ గురించి బాలయ్య మాట్లాడిన ఇన్స్పిరేషనల్ మెసేజ్ తాజాగా నెట్టింట మళ్ళీ వైరల్ అవుతుంది. ఆ షో లో మాట్లాడుతూ, తన పాత ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చాడు… తన మనసుకి చాలా దగ్గరైంది, ఇప్పటివరకు ఎవరితో పంచుకోనిది.. చెప్తున్నానంటూ.. తన ఫ్రెండ్ ఒకడు అప్పట్లో కాలేజీ అయిపోయాక, ఓ సారి తనకి ఫోన్ చేసాడని చెప్పాడు. అప్పుడు బాలయ్యతో తన ఫ్రెండ్ మాట్లాడుతూ..ఇలా చెప్పాడట. సివిల్స్ అటెంప్ట్ చేశాను, కానీ ఫెయిల్ అయ్యాను.. ఇక దేనికి పనికిరాని సూసైడ్ చేసుకుంటా అన్నాడట..

- Advertisement -

అప్పుడు బాలయ్య తన ఫ్రెండ్ తో సరేనని, నీ డెసిషన్ ని గౌరవిస్తానని చెప్తూ.. కానీ ఒకసారి కలుద్దాం.. లాస్ట్ టైం ఒక పెగ్గేద్దాం అన్నాడట. దానికి తన ఫ్రెండ్ సరేననగా, ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్లారట. అక్కడ డోర్ తీయగానే అక్కడ వాళ్ల ఫ్రెండ్స్ పది మంది ఉన్నారట. అయితే వాళ్ళకి తన ఫ్రెండ్ విషయం తెలీదట. అయినా అది చెప్పకుండా అందరూ కలిసి పెగ్గేసారని అన్నాడు. అయితే తెల్లవారక మాత్రం తన ఫ్రెండ్.. మాట్లాడుతూ ఇంత మంది ఫ్రెండ్స్ ఉండగా, నాకేం తక్కువా.. బొంగులో ఎసిపి ఈరోజు కాకపోతే రేపో, ఎల్లుండో వస్తది.. కానీ ఫ్రెండ్స్.. కోసం బతికేయొచ్చు అని అన్నాడట. ఇలా తన ఫ్రెండ్ గురించి చెప్తూ.. ఫ్రెండ్షిప్ గొప్పతనం అనే ఇది అన్నాడు.

అందుకే జాబిలికంటే తీయనిది, వెన్నెల కంటే చల్లనిది ఫ్రెండ్షిప్ అంటూ.. సామెతలు చెప్తూ మన సోది వినేవాడు, చెప్పే సీక్రెట్ దాచుకుంటాడు.. మన లైఫ్ కి పెట్రోల్ కొట్టేవాడై అన్ స్టాపబుల్ గా నిలుపుతాడు వాడే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు