Prabhas: తండ్రి మరణంతో శ్యామలా దేవికి అలాంటి మాట ఇచ్చిన ప్రభాస్..!

Prabhas..తెలుగు ప్రేక్షకులకు విభిన్నమైన పాత్రలలో విభిన్నమైన డైలాగులతో బాగా ఆకట్టుకున్న హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన వారసత్వంగా ప్రభాస్ ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు ప్రభాస్. అయితే కృష్ణంరాజు రాజుల కుటుంబమని ఇండస్ట్రీలోకి ఎంట్రీ చాలా సులువు అని అనుకుంటూ ఉంటారు. కానీ కృష్ణంరాజు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా చిన్న చిన్న పాత్రలో కూడా మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన తర్వాతే హీరోగా నటించారని తెలుస్తోంది.

Prabhas: Prabhas gave such a word to Shyamala Devi after the death of his father..!
Prabhas: Prabhas gave such a word to Shyamala Devi after the death of his father..!

రాజుల కుటుంబమే ఆయన నిలబడ్డానికి ఎంతో కష్టం..

నెమ్మదిగా సొంత బ్యానర్ మీద సినిమాలు చేసి మరీ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు కృష్ణంరాజు. అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్నటువంటి కృష్ణ , శోభన్ బాబు, ఎన్టీఆర్ , ఏఎన్నార్ వంటి వారి తరహాలో ఇమేజ్ ను సంపాదించడం అంటే అది సాధ్యమైనది కాదు. అయినప్పటికీ కూడా కృష్ణంరాజు రెబల్ స్టార్ గా ఎదిగారు. తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా అందుకున్నారు. ఇదే తరహాలోనే ప్రభాస్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం సులువైనప్పటికీ, తాను హీరోగా మలుచుకోవడానికి చాలానే కష్టపడ్డారు.

కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ కుటుంబం అల్లకల్లోలం..

ప్రభాస్ కూడా రాజుల కుటుంబ సభ్యులు కావడం చేత.. అదే హుందాతనంతో, సేవా గునంతో ప్రతి ఒక్కరిని కూడా బాగా పలకరించేవారు. అయితే రెబల్ స్టార్ కుటుంబానికి వెన్నుముకగా ఉన్న తన పెదనాన్న కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ ఒక్కసారిగా కృంగిపోయారట. కృష్ణంరాజు మరణంతో ఆయన భార్య శ్యామలాదేవి కూడా చాలా బాధపడినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి ఏంటా అంటూ శ్యామలాదేవి ఆలోచిస్తూ ఉండేదట. వీటికి తోడు తన తండ్రి మరణించడంతో కృష్ణంరాజు పిల్లలు కూడా ఒంటరి అయ్యామని ఫీలింగ్ లోకి వెళ్లిపోయారని సమాచారం. అయితే వారికి ధైర్యం ఇవ్వడానికి ప్రభాస్ ఒక మాట చెప్పారట.

- Advertisement -

పెద్దమ్మ శ్యామలాదేవికి అలా ధైర్యం చెప్పిన ప్రభాస్.

అదేమిటంటే.. ప్రభాస్ పెద్దమ్మ వద్దకు వెళ్లి మీరు అసలు బాధపడకండి. పెద్దనాన్న లేరని మీరు అనుకోవద్దు. మనం బాధపడితే కచ్చితంగా ఆయన లేరని అర్థం అవుతుంది. అదే మనం ధైర్యంగా ఉండగలిగితే ఆయన గురించి మాట్లాడుకుంటూ , ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటే కచ్చితంగా ఆయన మనతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటూ ధైర్యం చెప్పారట ప్రభాస్. అలా ప్రభాస్ చెప్పిన మాటలకు శ్యామలాదేవి కూడా ఆశ్చర్యపోయానని చెప్పింది. ఇక ప్రభాస్ చెప్పింది కూడా కరెక్ట్ గానే అనిపించింది. అందుకే అప్పటినుంచి కాస్త ధైర్యం తెచ్చుకుని ఇలా ఉంటున్నానని రెగ్యులర్గా బయటికి వెళ్లడం కూడా మొదలు పెట్టామని తెలుపుతోంది శ్యామలాదేవి. బయట కూడా చాలామంది ప్రజలు తాము కృష్ణంరాజుకు వీరాభిమాని అని చెప్పినప్పుడు చాలా ఆనంద పడుతున్నానని తెలిపింది శ్యామలాదేవి. అలా ప్రతి ఒక్కరి నోట కూడా తన భర్త మాటలు ప్రతిరోజు వింటూ ఉంటే ప్రభాస్ చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయని శ్యామలాదేవి వెల్లడించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు