Saranya Ponvannan: బలవంతంగా చేశా.. నా జీవితమే మారిపోయింది..?

Saranya Ponvannan.. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలాంటి స్థాయికి చేరుకుంటారో చెప్పడం అసాధ్యం. అయితే ఒక్కొక్కసారి ఇండస్ట్రీలో అనుకోకుండా ఇష్టం లేకపోయినా పాత్రలు చేసి కూడా సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వారిలో ప్రముఖ నటీమణి శరణ్య కూడా ఒకరు. తాజాగా ఈమె ఒక సినిమాలో ఇష్టం లేకుండా చేసి ఆ తర్వాత స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.

Saranya Ponvannan: Forced to act.. but my life has changed..?
Saranya Ponvannan: Forced to act.. but my life has changed..?

రఘువరన్ బీటెక్ సినిమా ..

అసలు విషయంలోకి వెళ్తే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన చిత్రం రఘువరన్ బీటెక్. రూ .8 కోట్లు పెట్టి తీస్తే రూ.53 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ యాక్షన్ కామెడీ డ్రామాలో తల్లి సెంటిమెంట్ చాలా ఎక్కువగా పండించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ కి తల్లిగా శరణ్య పొన్ వణ్ణన్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ఆమెను చూస్తున్న సేపు మన సొంత తల్లి మనకు గుర్తుకొస్తుంది. అంత సహజంగా నటించింది శరణ్య. అంతకు ముందు ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు పోషించిన ఆమె, ఈ సినిమాలో తల్లి పాత్ర పోషించడానికి ఒప్పుకోలేదు. అయితే ఇది మనకు ఆశ్చర్యంగా అనిపించినా ఈ మాట మాత్రం నిజమే. ఈ విషయాన్ని ఆమె ఇటీవల చెప్పుకొచ్చింది కూడా.

తల్లి పాత్ర బలవంతంగా చేశా..

రఘువరన్ బీటెక్ సినిమాను ధనుష్ సొంతంగా నిర్మించాడు. ఈ సినిమాలో పెళ్లి పాత్రను శరణ్య చేతనే చేయించాలని ఆయన అనుకున్నారట. ముందుగా కథ చెప్పడానికి వెళ్తే తనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ లిస్టు శరణ్యకు తెలిపాడు. అవి ప్రిపేర్ చేసి ఉంచాలని, తినేసి కథ చెప్పి వెళ్తానని శరణ్యకు ఫోన్ కాల్ చేసి మరీ చెప్పాడట ధనుష్. ఇదే విషయాన్ని శరణ్య చెబుతూ ఆయన చెప్పినట్లుగానే ధనుష్ మా ఇంటికి వచ్చాడు. భోజనం చేశాడు.. తర్వాత స్టోరీ చెప్పాడు. అయితే ఆ సినిమా కథ నాకు చాలా యావరేజ్ గా అనిపించింది. అమ్మ పాత్రకు అసలు ఎలాంటి ప్రాధాన్యత లేదనే భావన కలిగింది. ఆ పాత్రే ప్రాధాన్యత లేనిది అని అనుకుంటే దాన్ని మధ్యలోనే చంపేస్తారని తెలుసుకొని ఇక సినిమా చేయకూడదని అనుకున్నాను.. వెంటనే నేను ధనుష్ తో ఇదే విషయాన్ని చెప్పాను.. ఆయన సమాధానం వినగానే డిసప్పాయింట్ అవ్వలేదు.. నన్ను నమ్మండి ఈ పాత్ర మీకు మంచి పేరు తీసుకొస్తుంది అంటూ నన్ను ప్రోత్సహించాడు.

- Advertisement -

ధనుష్ కోసమే చేశా – శరణ్య

అయితే ధనుష్ ఎంత చెప్పినా సరే నాకు మాత్రం ఆ పాత్ర పైన నమ్మకం కలగలేదు. మీపైన ఒక మంచి ఎమోషనల్ సాంగ్ కూడా ఉంటుందని చెప్పిన తర్వాతే ఆయన మాట కాదనలేక నేను ఒప్పుకున్నాను. పెద్దగా ఇష్టం లేకపోయినా సినిమా షూటింగ్ కి వెళ్లాను. అక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా తల్లి క్యారెక్టర్ కి పెద్దగా ఇంపార్టెంట్ లేదనే భావన నాలో కలిగింది. ఎప్పుడైతే నా పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించానో , సినిమాలోని నా సన్నివేశాలు చూడడం మొదలు పెట్టానో అప్పుడే నాకు అర్థమైంది. నా పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది అనేది. నేను ఉన్న సన్నివేశాలకు ముందు వెనుక ఎన్నో ఎమోషనల్ సీన్లు యాడ్ చేసి సినిమాను చాలా అద్భుతంగా తీశారు. ఆ పాత్ర మధ్యలోనే చనిపోయినా అంత గొప్పగా అమ్మ పాత్ర రాసుకోవడం నాకు మరింత ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా ఆ సినిమాతో నా కెరియర్ వేరే స్థాయికి వెళ్లిపోయింది అంటూ చెప్పుకొచ్చింది శరణ్య.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు