Gowtham : బ్రహ్మానందం కొడుకు ఆస్తుల గురించి వింటే నోట మాట రాదు.. ప్రభాస్ కన్నా ఎక్కువే..

Gowtham : టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈయన తన కామెడీ కడుపుబ్బా నవ్విస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలను మించిన ఆస్తులను కూడా బెట్టాడు. ఆయన మాత్రమే కాదు.. తన మొదటి కొడుకు గౌతమ్ కూడా బాగానే ఆస్తులను కూడ బెడుతున్నాడు. ఈయన చేసింది ఒకటి, రెండు సినిమాలే.. ఆ తర్వాత ఇండస్ట్రీలో రాణించలేకపోయాడు.. స్వంతంగా బిజినెస్ లు చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు స్టార్ హీరోల కన్నా ఎక్కువ ఆస్తులను సంపాదించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు మంచి పేరే తెచ్చిపెట్టిన.. ఆ తర్వాత రిలీజైన ఒక్క సినిమా కూడా రాజా గౌతమ్‌ను హీరోగా నిలబెట్టలేకపోయింది. అస్సలు ఈయన సినిమాలు రిలీజవుతున్న విషయమే సగం జనాలకు తెలియకుండానే వెళ్లిపోయేవి. ఇప్పటివరకు గౌతమ్‌ ఏడు సినిమాల్లో నటిస్తే అందులో ఒకటి మాత్రమే హిట్ టాక్ ను అందుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. చాలా బిజినెస్ లు చేస్తున్నాడని టాక్.. ఏదో టైమ్‌పాస్‌కు సినిమాలు చేస్తుంటాడని తెలుస్తుంది. గౌతమ్‌కు చాలా బిజినెస్‌లు ఉన్నాయట. హైదరాబాద్‌లో గౌతమ్‌కు ఎన్నో కమర్షియల్‌ కంప్లెక్స్‌లు కూడా ఉన్నాయని సమాచారం..

Brahmanandam's son Gautham has accumulated more assets than Prabhas
Brahmanandam’s son Gautham has accumulated more assets than Prabhas

అంతేకాదు కొన్ని ఐటి కంపెనీలల్లో పెట్టుబడులు పెట్టారట.. బెంగళూర్‌లో ఆయన చాలా రెస్టారెంట్స్‌ ఉన్నాయట. వాటి నుంచి నెలకు 30 కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలుస్తుంది. ఏడాదికి ప్రభాస్ కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఈ మధ్య మరో నాలుగు కొత్త బిజినెస్ లను స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే స్టార్ హీరోలను మించిన ఆస్తులను కూడబెట్టాడు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్య ఓ సినిమా చేయబోతున్నాడని టాక్.. తన తండ్రితో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నాడు.. అది హిట్ అయితే మళ్లీ సినిమాలను లైన్లో పెట్టనున్నాడని ఇండస్ట్రీలో టాక్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు