Allu Sirish : BESTEST ENTERTAINMENT… @THE BESTEST PRICE ఇది బడ్డీ సినిమాకు అల్లు శిరీష్ వాడిన ప్రమోషనల్ డైలాగ్. దీన్ని ఎందుకు వాడాడు అంటే… బడ్డీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు గారి అబ్బాయి… చాలా పెద్ద మనసు చేసుకుని, సామాన్య సినీ లవర్స్ గురించి, ఫ్యామిలీ ఆడియన్స్ గురించి ఆలోచించాడు. ఎక్కువ టికెట్ ప్రైజ్ ఉండటం వల్ల ఈ సెక్షన్ ఆడియన్స్ థియేటర్స్‌కి ఎంటర్టైన్మెంట్కు దూరమవుతున్నారు అని ఓ మంచి పాయింట్ చెప్పాడు అల్లు శిరీష్. దీంతో ఈ అల్లు గారి అబ్బాయిపై ఫుల్ పాజిటివ్ వైబ్ వచ్చింది అందరికీ. అనుకున్నట్టే తన బడ్డీ సినిమాకు టికెట్ ప్రైజ్‌లను అందరికీ అందుబాటులో ఉండేలా ఉంటుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లోనే సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ల్లో ఒక్కో టికెట్ ప్రైజ్ 99 రూపాయలు. మల్టీ స్క్రీన్ థియేటర్స్‌లో 125 రూపాయలు అని ఉంది. అలాగే పైన చెప్పిన డైలాగ్ BESTEST ENTERTAINMENT… @THE BESTEST PRICE ఉంది.
ఈ డైలాగ్‌తో ఈ టికెట్ ప్రైజ్‌లతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ బజ్తోనే సినిమాకు ఒపెనింగ్స్ వచ్చాయన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే సినిమా రిలీజ్ కు ముందు అనౌన్స్ చేసిన ఈ టికెట్ ప్రైజ్‌లు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. అన్ని థియేటర్స్ వరకు కాకుండా, అల్లు వారి సొంత థియేటర్లో కూడా 125 రూపాయలకు టికెట్ రావడం లేదు. ఇంకా చెప్పాలంటే.. దాదాపు డబుల్ ప్రైజ్ అవుతుంది.
అల్లు శిరీష్ ఎమోషనల్ స్పీచ్..
ఆది వారం తెలుగు ప్రజలు ఎంటర్టైన్మెంట్ ను కోరుకుంటారు. అందుకే దాదాపు సినిమాలన్నీ వీకెండ్‌కి కలిసొచ్చేలా రిలీజ్ చేస్తారు. బడ్డీని కూడా అలాగే రిలీజ్ చేశారు. అల్లు శిరీష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా ఎమోషనల్‌గా టికెట్ ప్రైజ్ ల గురించి మాట్లాడారు. దీంతో సామాన్య ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి ఈ BESTEST ENTERTAINMENT మూవీని BESTEST PRICE లో చూద్ధామని అనుకున్నారు. కానీ, శిరీష్ ఎమోషనల్ గా చెప్పిన ధరలు ఎక్కడా కనిపించడం లేదు. పోనీ అల్లు ఫ్యామిలీ సొంత థియేటర్ అయిన AAA Cinemas లో అయినా శిరీష్ చెప్పిన ధరలకు టికెట్లు కనిపిస్తాయా అంటే అది లేదు.
ధరలు తక్కువ అన్నది ప్రమోషనల్ స్టంటా…?
బడ్డీ ఆగష్టు 02 న రిలీజ్ అయింది. రిలీజ్ అయి కనీసం రెండు రోజులు కూడా గడవక ముందే… అల్లు శిరీష్ చెప్పిన BESTEST PRICE కనిపించడం లేదు. దీంతో తన బడ్డీ సినిమా ప్రమోషన్స్ కోసమే తక్కువ ధరలు అనే పదాన్ని వాడాడా.. అని ఆడియన్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అంతే కాదు, తక్కువ ప్రైజ్ అని చెప్పి ఆయా ఆడియన్స్ ను ఎమోషనల్ గా ఫుల్ చేశారని కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
అయితే దీనిపై అల్లు శిరీష్ నుంచి సమాధానం రావాలని కూడా సినీ ప్రియులు అంటున్నారు. కానీ, అల్లు వారి అబ్బాయి నుంచి సమాధానం వచ్చే ఛాన్స్ ఉంది అంటరా..?