Bollywood Heroine: ఒకప్పుడు బాడీ షేమింగ్ తో అవమానం.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్..!

Bollywood Heroine.. సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలామంది హీరోయిన్లు ముఖ్యంగా బాడీ షేమింగ్ ఎదుర్కొంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది లావుగా ఉన్నావని , మరికొంతమందిని నల్లగా ఉన్నావని ఇలా రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయితే ఆ తర్వాత కాలంలో వారు తమను తాను నిరూపించుకొని స్టార్ సెలబ్రిటీలుగా చలామణి అవుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కాజోల్ కూడా ఒకరు. ఈరోజు ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈమె సూపర్ స్టార్ భార్య కాకముందు 1990లలో అత్యంత ఖరీదైన బాలీవుడ్ నటిగా పేరు దక్కించుకుంది.

Bollywood Heroine: Once shamed with body shaming.. If cut, star heroine..!
Bollywood Heroine: Once shamed with body shaming.. If cut, star heroine..!

నల్లగా ఉన్నానని రిజెక్ట్ చేశారు..

బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఈరోజు తన 50వ పుట్టినరోజును జరుపుకుంటుంది. 32 ఏళ్లుగా సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. నేటికీ తక్కువ సినిమాలే చేసిన ఒకప్పుడు బాలీవుడ్లో బాగా పాపులర్ అయిన బ్యూటీగా పేరు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ..సూపర్ స్టార్ అజయ్ దేవగన్ తో వివాహానికి ముందు ఆమె సినిమాలు చేసి బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. అయితే ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఫలితంగా సినిమా అవకాశాలు కూడా కోల్పోయింది. దీనికి కారణం ఆమె కలర్ అని సమాచారం. అందుకే ఆమెతో పని చేయడానికి చాలామంది వెనుకడుగు వేసే వారట.

ఆ సినిమాతో కెరియర్ టర్న్..

వాస్తవానికి కాజోల్ ఎవరో కాదు దివంగత నిర్మాత, దర్శకుడు సోము ముఖర్జీ , నటి తనూజల కుమార్తె , 32 ఏళ్ళ క్రితం అంటే 1992లో బేఖుది సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సమయానికి ఆమె వయసు కేవలం 17 ఏళ్ళే. మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వగా ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొని, రెండో సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఇక 1993లో వచ్చిన బాజీగర్ సినిమా తర్వాత ఈమె వెను తిరుగు చూడలేదు. ఈమె ప్రతి పెద్ద బ్యానర్ లో వచ్చే సినిమాలో భాగం కావాలని అనుకుంది ఈ సినిమా తర్వాతే ప్రతి నిర్మాణ సంస్థ కూడా ఈమెకు అవకాశం ఇచ్చింది.

- Advertisement -

నేటికీ అవి వెంటాడుతూనే వున్నాయి..

ఇకపోతే తాను నేడు ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్టాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాజోల్ సినిమాల్లో తన రంగు బరువు కారణంగా ఎన్నో అవమానాలు పడ్డానని , అవన్నీ భరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది కాజోల్ . నేడు విజయవంతమైన నటిగా మారినప్పటికీ నా గతం నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది. నేటికీ ఆ వెక్కిరింతలు, అవమానాలు వినవలసి వస్తోంది అంటూ చెప్పుకొచ్చింది. నల్లగా ఉన్నానని, లావుగా ఉన్నానని ఎగతాళి చేసేవారు. ప్రజలు నన్ను అవమానించినప్పుడు హేళన చేసినప్పుడు చాలా బాధపడ్డాను ఒకానొక సమయంలో ఆత్మవిశ్వాసం కోల్పోయాను. ఇక అదే సమయంలో నన్ను నేను అద్దంలో చూసుకోవడం ప్రారంభించా. నన్ను నేను అందంగా ఉన్నానని ఒప్పించుకున్నాను. ఇక నల్లగా కనిపించే నేను అకస్మాత్తుగా అందంగా కనిపించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు కూడా విమర్శలు తప్పలేదు. స్కిన్ ట్రీట్మెంట్ చేయించుకుందని ఆరోపణలు వచ్చాయి అలాంటిదేమీ చేయలేదు. షూటింగ్ లు అంటూ ఎండలో తిరగడం వల్లే నల్లగా మారిపోయాను. కానీ కొద్ది రోజులు ఇంట్లో ఉండేసరికి కలర్ మళ్ళీ మామూలుగా మారింది అంటూ చెప్పుకొచ్చింది కాజోల్ ఇక అజయ్ దేవగన్ భార్యగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు