Chiyaan Vikram : పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్..

Chiyaan Vikram : తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వస్తున్నాడు. విభిన్న పాత్రల్లో నటిస్తూ సినీ అభిమానుల మనసు దోచుకుంటున్నాడు. ఈయన ప్రస్తుతం తంగలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న గ్రాండ్ గా నిర్వహించారు.. ఈ ఈవెంట్ లో విక్రమ్ ఎన్నో విషయాల గురించి బయటపెట్టాడు.. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.. అంతేకాదు పాలిటిక్స్ పై తన అభిప్రాయాన్ని కూడా బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది..

విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తంగలాన్ ‘ ఈ సినిమాను ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిసిందే.. విడుదలకు కేవలం కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు.. ఈ సందర్బంగా హీరో మాట్లాడుతూ.. నాకు ఇంతటి స్థాయి రావడానికి నా అభిమానులే కారణం.. తంగలాన్ టీజర్, ట్రైలర్ మీకు బాగా నచ్చాయని ఆశిస్తున్నా. మీరు నా గురించి, మా తంగలాన్ సినిమా చెప్పిన ప్రోత్సాహాన్నిచ్చే మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి.. ఈ సినిమా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుందని చెప్పాడు. అలాగే విక్రమ్ పాలిటిక్స్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు.

Tamil hero Vikram Chian is about to enter politics
Tamil hero Vikram Chian is about to enter politics

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని చెబుతూ తనకి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉంది.. కానీ అంటూ గ్యాప్ ఇచ్చారు. దీనికి సంబందించిన వీడియో వైరల్ అవ్వడంతో ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ విక్రమ్ త్వరలోనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో చర్చలు చేస్తున్నారు. ఈ వార్తలో నిజమేంత ఉందో.. అసలు విక్రమ్ మనసులో ఏముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. తంగలాన్ మూవీలో మాళవిక మోహనన్‌, పార్వతీ తిరువోతు కీలక పాత్రలు పోషించారు. పా. రంజిత్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహారిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విక్రమ్ ఈ సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు.. ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు