Kalki -2: సీక్వెల్ కి మరింత ఆలస్యం.. అసలేమైందంటే..?

Kalki -2: ప్రముఖ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమా మంచి విజయం అందం కోవడమే కాదు ఏకంగా రూ .1100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి భారీ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమా మరో గ్రేట్ సినిమాగా నిలిచిందని చెప్పవచ్చు. ఇకపోతే కల్కి సినిమాలో తలెత్తిన ఎన్నో ప్రశ్నలకు ఈ సినిమా సీక్వెల్లో సమాధానం దొరుకుతుందని అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ కూడా పార్ట్ 2 షూటింగ్ కొంత భాగం అయిందని, 2025లో మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తామని కూడా తెలిపారు. దీంతో అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే సడన్గా ఈ సినిమా గురించిన ఒక షాకింగ్ అప్డేట్ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోందని చెప్పవచ్చు.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కల్కి సినిమా సీక్వెల్ మరో రెండు సంవత్సరాలు సమయం పట్టేలాగా కనిపిస్తోందని సమాచారం. అసలు ఇంత ఆలస్యానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Kalki-2: More delay for the sequel.. What happened to the original..?
Kalki-2: More delay for the sequel.. What happened to the original..?

కల్కి2 వచ్చే ఏడాది జులై కల్లా రిలీజ్..

అసలు విషయంలోకెళితే.. కల్కి సినిమా విడుదలైన సమయంలో కల్కి2 వచ్చే ఏడాది జులై కల్లా రిలీజ్ అయిపోతుందంటూ నిర్మాత అశ్వినీ దత్ ప్రకటించారు. అదే సమయంలో నాగ్ అశ్విన్ కూడా స్పందిస్తూ.. మరిన్ని ప్రపంచాలను సృష్టించబోతున్నాము. సినిమా ఎప్పటికీ పూర్తవుతుంది అనే విషయాన్ని అప్పుడే చెప్పలేము అంటూ క్లియర్ గా చెప్పలేము అంటూ చెప్పేశాడు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కల్కి 2 ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది అని సమాచారం. కల్కి సినిమాలో నటించేటప్పుడు దీపికా పదుకొనే గర్భవతిగా ఉన్నారు. సెప్టెంబర్ లో ఆమె తన బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో కల్కి 2 సినిమా షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని అందరూ అనుకున్నారు. కానీ అసలు చిక్కంతా అక్కడే వచ్చి పడింది.

దీపిక వల్లే ఆలస్యం..

ఎందుకంటే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె దాదాపు రెండు సంవత్సరాల పాటు తన బిడ్డకు సమయం కేటాయించాలని భావిస్తోందట. అందులో భాగంగానే తనకెంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్టును కూడా ఆమె వదులుకుంది. అలాగే ఒక పాపులర్ బాలీవుడ్ షో సీజన్ 3 కి కూడా నో చెప్పిందట. ఇలా తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో గొప్ప ప్రాజెక్టులను కూడా దీపికా పదుకొనే వదులుకోవడానికి సిద్ధమైందని సమాచారం. ఇక అందులో భాగంగానే కల్కి సీక్వెల్ కోసం దీపిక నటించాలి అంటే చిత్ర బృందం ఎదురుచూడాల్సిందే..మరి ఏది ఏమైనా ప్రభాస్ అభిమానులను ఈ విషయం పూర్తిస్థాయిలో నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు