Aditi rao hydari: కాబోయే భర్త అంటూ పోస్ట్.. క్లారిటీ ఇచ్చేసిందిగా..!

Adithi rao hydari.. టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. హీరోయిన్ అతిధి రావు హైదరి. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్నట్టుగా గతంలో ఎక్కువగా వార్తలు వినిపించడం వల్ల ఈ అమ్మడి పేరు మరింత వైరల్ గా మారింది. అయితే ఎంగేజ్మెంట్ కూడా ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కొన్నేళ్లపాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట చివరికి వనపర్తిలో ఒక ఆలయంలో సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని మళ్లీ కొద్ది రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ ద్వారా తెలియజేశారు.

Aditi rao hydari: Future husband post.. to give clarity..!
Aditi rao hydari: Future husband post.. to give clarity..!

కాబోయే భర్త అంటూ క్లారిటీ..

అయితే తాజాగా తన కాబోయే భర్తకు అవార్డులు వచ్చాయంటూ అతిథి రావు హైదరి ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. ఈ విషయం పైన తనకి ఆనందంగా ఉంది అంటూ తెలిపింది. ఈ గెలుపు మీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను సైతం షేర్ చేసింది. అలాగే సిద్ధార్థ నటించిన చిన్నా అనే సినిమాకి ఈ అవార్డులు రావడంతో అటు చిత్ర బృందానికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్ధార్థ తన ఫిలింఫేర్ అవార్డులను సైతం పక్కన పెట్టుకొని నిద్రిస్తున్నటువంటి కొన్ని ఫోటోలను అతిథి రావు హైదరి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

చిన్న సినిమాకి అవార్డుల వర్షం..

ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఎట్టకేలకు తన కాబోయే భర్త అంటూ చెప్పేసిందని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సిద్దార్థ్ నటించిన చిన్న అనే సినిమాకి ఏకంగా ఏడు అవార్డులను సైతం అందుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గా అరుణ్ కుమార్ కు ఉత్తమ చిత్రంగా ఈ సినిమా అందుకుంది.. అలాగే ఉత్తమ డైరెక్టర్ గా అందుకున్నారు. ఉత్తమ నటుడు క్రిటిక్స్ , ఉత్తమ సహాయ పాత్ర , ఉత్తమ నటి , ఉత్తమ సంగీత ఆల్బమ్ , ఉత్తమ నేపద్య గాయని ఇలా పలు విభాగాలలో అవార్డులను సైతం చిన్నా సినిమాకి అందుకున్నారు.

- Advertisement -

సిద్ధార్థ కెరియర్..

ఇక సిద్ధార్థ వ్యక్తిగత జీవిత విషయానికొస్తే, చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సమంతను మొదలుకొని హన్సిక వరకు ఇలా చాలామందితో ఈయన ఎఫైర్ నడిపించారని వార్తలు వినిపించాయి. అయితే ఏ ఒక్కటి కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. కానీ గతంలో వివాహం చేసుకున్న ఈయన.. ఆమెకు కూడా విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సంవత్సరాల క్రితం అతిథి రావు హైదరితో రిలేషన్ లో ఉన్నాడంటూ వార్తలు రాగా ఇప్పుడు ఆ వార్తలు నిజం చేస్తూ ఈ జంట త్వరలోనే వైవాహిక బంధం లోకి అడుగు పెట్టబోతున్నారు . మరోవైపు అతిధిరావు హైదరి కూడా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చినట్లు సమాచారం. ఇక నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఎప్పుడు వైవాహిక బంధం లోకి అడుగు పెడతారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు