Suhas-keerthi Suresh : సుహాస్ – కీర్తి సురేష్ మూవీ క్రేజీ అప్డేట్.. స్ట్రీమింగ్ అప్పుడే?

Suhas-keerthi Suresh : సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో అందాల భామ కీర్తి సురేష్ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఓవైపు అగ్ర హీరోలతో కలిసి కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటుతోంది. ‘మహానటి’ మూవీతో ఉత్తమ నటిగా నేషనల్ ఫిలిం అవార్డ్ సాధించి అందరి చేత ప్రశంసలు అందుకుంది. అలాంటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు చిన్న హీరోతో రొమాన్స్ చేయబోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది..

యూట్యూబ్ లో షార్ట్, వెబ్ స్టోరీస్ తో బాగా పాపులరిటీ సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలు చేస్తున్నాడు. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ అందుకుంది. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అందులో కొన్ని సినిమాలు విడుదల అయ్యి హిట్ అవ్వగా, మరికొన్ని సినిమాలు మాత్రమే ప్లాప్ అయ్యాయి. గతేడాది ‘రైటర్ పద్మభూషణ్’, ఈ ఏడాదిలో ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు’ చిత్రాలతో మాంచి సక్సెస్ సాధించాడు. బిజీ షెడ్యూల్స్ తో సంవత్సరం పొడవునా బిజీగా గడుపుతున్న సుహాస్.. ఇప్పుడు కీర్తి సురేష్ తో జత కట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Suhas-Keerthi Suresh Movie Crazy Update.. When is Streaming
Suhas-Keerthi Suresh Movie Crazy Update.. When is Streaming

కీర్తి సురేష్ – సుహాస్ హీరో, హీరోయిన్లు ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమా రూపొందుతోంది. ఐవి శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు నిర్మిస్తున్నారు. దీనికి వసంత్ మురళీకృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు. ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చెయ్యడం లేదట. కేవలం అమెజాన్ ప్రైమ్ ఓటిటి కోసం రూపొందిస్తున్న ఒరిజినల్ మూవీ.. ఆ సినిమా గురించి రెండు నెలల క్రితం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యినట్లు సమాచారం. వచ్చేనెలలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.. ఈ మూవీ పై ఆసక్తి కనబరుస్తున్నారు సినీ లవర్స్.. దీని గురించి మరో అప్డేట్ ను త్వరలో ప్రకటించనున్నారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు