Raj Tarun – Ariyana: ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన అరియానా..!

Raj Tarun – Ariyana.. గత కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్ , ఆయన ప్రేయసి లావణ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన రోజుకొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ పై ఆయన ప్రేయసి లావణ్య చేస్తున్న ఆరోపణలు నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు రాజ్ తరుణ్ పై నెగిటివిటీని పెంచేలా చేస్తున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిపిన లావణ్య , ఏకంగా అరియానాను ప్రెగ్నెంట్ చేశాడంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Raj Tarun - Ariyana: Ariyana reacted to the news of pregnancy.. !
Raj Tarun – Ariyana: Ariyana reacted to the news of pregnancy.. !

అరియానా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు..

లావణ్య మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ అమ్మాయిలతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసేవాడు. అందులో భాగంగానే అరియానాను కూడా ప్రెగ్నెంట్ చేశాడు అంటూ సంచలన కామెంట్లు చేసింది.దీంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయాలు బాగా వైరల్ గా మారుతున్న నేపథ్యంలో ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ అరియాణా ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది అని శేఖర్ భాష తెలిపారు. అంతేకాదు లావణ్య మాటలకు ఆమె మండిపడింది అని కూడా తెలిపారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

అరియానా ప్రెగ్నెంట్.. ఖండించిన శేఖర్ భాషా..

అసలు విషయంలోకెళితే.. కొద్ది రోజుల క్రితం రాజ్ తరుణ్ , మస్తాన్ సాయిలతో లావణ్య ఎఫైర్ నడిపిందంటూ, మస్తాన్ సాయి వల్లే లావణ్య నెల తప్పిందని, ఆ టైంలో ఆమెకు సహాయంగా వచ్చిన ప్రియ అనే అమ్మాయికి కూడా డ్రగ్స్ అలవాటు చేసిందని శేఖర్ భాష ఆరోపించాడు. దీంతో లావణ్య తాను నెల తప్పడం కాదని రాజ్ తరుణ్ వల్లే.. ఆరియనా ప్రెగ్నెంట్ అయ్యిందని.. అందుకే కాస్త ఆమె బరువు పెరిగినట్టుగా ఉందని కూడా లావణ్య తెలియజేసిందట.. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన శేఖర్ భాషా మాట్లాడుతూ.. అరియానా తనతో మాట్లాడిందని శేఖర్ భాష తెలిపాడు. అరియానా ప్రెగ్నెంట్ ఏంటండీ బాబు.. ఆమె ప్రెగ్నెంట్ అయింది, అందుకే బరువు పెరిగిందని అంటోంది లావణ్య.ఈ విషయంపై నేను అరియానాతో కూడా మాట్లాడాను. ఆడపిల్లను న్యాయం చేయండి అంటోంది. అదే ఆడపిల్లపై ఇంత నీచంగా నిందలు ఎలా వేస్తుంది? నేను లావు అవడానికి .. ప్రెగ్నెంట్ కి సంబంధం ఏంటి? నేను సినిమాల కోసం లావు అయ్యాను. అసలు దానికి బుద్ధి ఉందా? అని అడిగింది.

- Advertisement -

త్వరలోనే అరియానా పెళ్లి.

త్వరలోనే అరియానా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందట. ఇలాంటి నిందలేస్తే ఆమె భవిష్యత్తు ఏమవ్వాలి. ఇదేనా లావణ్య సంస్కారం. అరియానా ప్రెగ్నెంట్.. ఇలియానా ప్రెగ్నెంట్ అంటుంది.. అంటూ లావణ్య పై ఫైర్ అయ్యాడు శేఖర్ భాష. లావణ్య చేసిన కామెంట్లకు ఆరియానా తనతో చెప్పుకొని బాధపడిందని చెప్పుకొస్తూ పలు ఆశ్చర్యకర విషయాలు తెలియజేశారు శేఖర్ భాష.

శేఖర్ భాషా పై దాడి..

ఇదిలా ఉండగా నిన్నటికి నిన్న శేఖర్ భాషా.. తనపై లావణ్య తన రౌడీలతో దాడి చేయించిందని, హాస్పిటల్ నుంచి ఒక వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికైతే లావణ్య – రాజ్ తరుణ్ కేసులో రోజుకు ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు