Devara Second Song : ఎంత ట్రోల్ అయినా యూట్యూబ్ లో సాలిడ్ వ్యూస్ కొట్టిన సెకండ్ సాంగ్..

Devara Second Song : జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ గా “దేవర” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. ఇప్పటికే దేవర నుండి రిలీజ్ అయిన టీజర్స్, పోస్టర్లు సినిమాపై అంచనాలని భారీగా పెంచేసాయి. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ‘ఫియర్’ సాంగ్ పేరుతో విడుదల కాగా ఆ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత దేవర చిత్ర యూనిట్ నుండి ఇప్పటివరకు మరో అప్డేట్ లేకపోగా, లేటెస్ట్ గా రెండో సాంగ్ ని రిలీజ్ చేసారు. అందరూ అనుకున్నట్టుగానే రెండో సాంగ్ హీరో, హీరోయిన్ల మధ్య డ్యూయట్ సాంగ్ గా రిలీజ్ చేసారు.

Devara Chuthamalle song ranked in top 3 of Tollywood Most Viewed Lyrical Songs in 24Hrs

ట్రోలింగ్ ఎదుర్కున్న చుట్టమల్లే సాంగ్…

ఇక దేవర నుండి రెండో సాంగ్ చుట్టమల్లే పేరుతో రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేయగా, కాసేపటికే యూట్యూబ్ లో ట్రెండ్ అయింది. రామజోగయ్య శాస్త్రి రాసిన, ఈ పాటను సింగర్ శిల్పారావు పాడింది. ఇక ఈ పాటకు బాస్కో మార్టిస్ అందించిన కొరియోగ్ర‌ఫీ బాగుంది. కానీ ట్యూన్స్ మాత్రం అనిరుధ్ కాపీ చేసాడని, శ్రీలంక ఫేమస్ సాంగ్ అయిన యొహిని పాడిన “మనికే మాగే హితే” పాటను కాపీ చేసాడని ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ చాలామంది ఈ పాటను ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా విన్నప్పుడు బాగానే ఉన్నా, ఆ తర్వాత విపరీతంగా అనిరుద్ పై ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

ట్రోల్ అయినా పాటకి సాలిడ్ వ్యూస్…

అయితే దేవర రెండో పాట నెట్టింట ఎంత ట్రోల్ అయినా వ్యూస్ మాత్రం సాలిడ్ గా వచ్చాయని చెప్పాలి. దేవర రెండో పాట విడుదలైన 24 గంటల్లో యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ కి సంబంధించి 15.68 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే లైక్స్ 497K దాకా వచ్చాయి. ఇక దీనికంటే ముందు మహేష్ బాబు సర్కారు వారి పాట లో పెన్నీ సాంగ్ (16.38M), గుంటూరు కారం ధమ్ మసాలా సాంగ్ 17.42 మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ఉన్నాయి. ఇక దేవర రెండో సాంగ్ ఎంత ట్రోల్ అయినా యూట్యూబ్ లో వ్యూస్ బాగానే వచ్చాయని చెప్పాలి. చెప్పాలంటే ట్రోలింగ్ కూడా పాటకి ప్లస్ అయిందని అంటున్నారు నెటిజన్లు. మరో రాబోయే క్రేజీ సినిమాల్లో ఏ పాట కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు