Mr Bacchan : సినిమాలో అతనుండేది 3 నిమిషాలేనట?

Mr Bacchan : టాలీవుడ్ లో ఆగష్టు 15న పెద్దా చిన్నా కలిపి అరడజను క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మాస్ మహారాజ్ రవితేజ నటించిన “మిస్టర్ బచ్చన్” సినిమా కూడా ఒకటి. రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రిలీజ్ కి వారం రోజులే సమయం ఉండగా, చిత్ర యూనిట్ కూడా నాన్ స్టాప్ గా భారీగా ప్రమోషన్లు చేస్తూ, సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఇక ఆల్రెడీ టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి బజ్ ని తీసుకురాగా, డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పటికే తన మార్క్ ప్రమోషన్లతో సినిమాపై కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు. ఇక ఫైనల్ గా మిస్టర్ బచ్చన్ నుండి ఫైనల్ బ్లాస్ట్ కి కూడా ముహూర్తం ఫిక్స్ అయింది.

Sidhu Jonnalagadda's cameo role in Mr. Bachchan's movie is just 3 minutes!

సినిమాలో అతనుండేది 3 నిమిషాలేనట?

ఆగష్టు 7న సాయంత్రం మిస్టర్ బచ్చన్ (Mr Bacchan) ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక చేస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు . కానీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ మిగతా ప్రమోషన్లు అన్ని చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ ఓ క్యామియో రోల్ చేస్తున్నాడని కొన్ని రోజుల నుండి నెట్టింట వార్తలు వస్తున్న సంగతి తెలిసందే. అయితే చిత్ర యూనిట్ నుండి అనధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారం ఇది నిజమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ ఉండేది కేవలం 3 నిముషాలు మాత్రమేనట. అది కూడా సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ సీన్ లో వచ్చి అలా హీరోతో కలిసి ఫైట్ చేసి వెళ్ళిపోతాడట.

- Advertisement -

పంద్రాగస్టున పోటీకి సిద్ధం!

అయితే సిద్ధూ కనిపించేది 3 నిముషాలే అయినపుడు ఈ సినిమాలో పెట్టాల్సిన అవసరం ఏముందని నెట్టింట టాక్ నడుస్తుంది. మూడు నిమిషాల రోల్ అంటే కథతో పెద్దగా అవసరం లేని రోల్ అని అనుకుంటున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా మిస్టర్ బచ్చన్ సినిమా కోసం ఇప్పుడు మూవీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక పంద్రాగస్టు రోజు విడుదలయ్యే సినిమాల్లో మిస్టర్ బచ్చన్ తో పాటు రామ్ డబుల్ ఇస్మార్ట్, విక్రమ్ తంగలాన్ మరో మూడు చిన్న సినిమాలున్నాయి. మరి పంద్రాగస్టు పోటీలో మిస్టర్ బచ్చన్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు