Samantha: ఆ విషయంలో స్టార్ హీరోలకు పోటీగా సామ్.. విడాకుల తర్వాత కలిసొచ్చిందా..?

Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని తెలుగు, తమిళ్ ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తున్న ప్రముఖ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మనస్థాపానికి గురైంది పైగా మయోసైటిస్ అనే వ్యాధి భారినపడి దాదాపు ఏడాది కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ తర్వాత రెండు మూడు సినిమాలలో నటించినా.. ఏవీ కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇక ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Samantha: Samantha is competing with the star heroes in that regard.. Did you get together after the divorce?
Samantha: Samantha is competing with the star heroes in that regard.. Did you get together after the divorce?

యాక్షన్ చిత్రాలతో దూసుకుపోతున్న సమంత..

ప్రస్తుతం అన్నీ కూడా యాక్షన్ చిత్రాలే ఎంచుకుంటూ భారీగా దూసుకుపోతున్న సమంత పారిపోషకం విషయంలో కూడా జెడ్ స్పీడులో ఉందని చెప్పవచ్చు. సాధారణంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.. అందులో భాగంగానే సమంత కూడా పోటీ ప్రపంచంలో డిమాండ్ కు తగ్గ రేటు అందుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ సంపాదించుకున్న ఈమె కెరియర్ ప్రారంభంలోనే అద్భుతమైన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది.

ఒక్కో చిత్రానికి రూ.10 కోట్ల రెమ్యూనరేషన్..

సజీవమైన పాత్రలు, సాలిడ్ స్క్రిప్ట్ ఎంపికలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సమంత తన పారితోషకం విషయంలో మరో రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పారితోషకం విషయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు పోటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఒక్కో చిత్రానికి రూ .10 కోట్లు తీసుకుంటూ రికార్డు సృష్టించింది.. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్న సిటాడెల్ – హనీ బన్నీ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఈమె దాదాపు రూ 10కోట్లు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .ఇదొక రికార్డు అని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు దక్షిణాది చిత్ర సీమలో నయనతార మినహా ఏ హీరోయిన్ కూడా ఇంత పెద్ద మొత్తాన్ని అందుకున్న దాఖలాలు లేవు. మరొకవైపు మీడియం రేంజ్ హీరోలు కూడా కొంతమంది ఈ రేంజ్ లో పారితోషకం అందుకోవడం లేదు.

- Advertisement -

రేర్ రికార్డ్ అందుకున్న సమంత..

సమంత ఎప్పుడైతే హిందీలో ఫ్యామిలీ మెన్ సీజన్ -2 లో నటించి సూపర్ విజయాన్ని అందుకుందో.. ఈమె డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది. పైగా ఈ సిరీస్ లో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈమెకు ఆ తర్వాత ఓటీటీ రంగంలో భారీగా ఆఫర్లు వచ్చాయి.అందులో భాగంగానే సిటాడెల్ సిరీస్ లో నటించేందుకు సమంతకు పది కోట్ల రూపాయల పారిపోషకం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే టీజర్ విడుదల కాగా ఈమె యాక్షన్ సన్నివేశాలకు విపరీతమైన రెస్పాన్స్ లభించింది. తన కెరియర్ ప్రారంభం నుంచే పారితోషకం విషయంలో కూడా సత్తా చాటుతున్న ఈమె .. తక్కువ కాలంలోనే కోటి రూపాయల మార్కును చేరిన హీరోయిన్గా కూడా గతంలో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు