Mahesh Babu: రీ రిలీజ్ కి ఆ సినిమా ఎందుకు అన్నారు, ఇప్పుడు దాని కోసమే ఎగబడుతున్నారు

Mahesh Babu: ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోస్ లో మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమా అంటేనే ఒక రకమైన పండగ వాతావరణం ఉంటుంది. మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ చేశాడు. మహేష్ బాబుకి కమర్షియల్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిన సినిమా అంటే ఒక్కడు అని చెప్పాలి. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. అప్పట్లో ఒక్కడు సినిమాని మిస్ అయిన వాళ్ళందరూ కూడా రీ రిలీజ్ లో ఆ సినిమాను చూశారు. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఆ సినిమా సెలబ్రేషన్స్ వేరే లెవెల్ లో అనిపించాయి.

ఇక అక్కడినుంచి సినిమాలు రీ రిలీజ్ చేయటం మొదలుపెట్టారు చాలామంది దర్శక నిర్మాతలు. ఇక మహేష్ బాబు కెరియర్ లో ఒక్కడు పోకిరి బిజినెస్మెన్ సినిమాలు ఇదివరకే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మురారి సినిమాను మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి ఈ సినిమాను రిలీస్ చేస్తున్నారు అన్నప్పుడు ఈ సినిమా ఎందుకు ఖలేజా, అతడు వంటి సినిమాలు కోరుకున్నారు చాలామంది మహేష్ బాబు అభిమానులు. అయితే ఈ సినిమా కూడా ఇప్పుడు క్రేజ్ విపరీతంగా ఉంది అని చెప్పాలి. రీసెంట్ రిలీజ్ కంటే కూడా ఈ సినిమాకి ఎక్కువ టికెట్లు బుక్ అవుతున్నాయి. రీ రిలీజ్ కి మురారి సినిమా ఎందుకు అన్నారు, ఇప్పుడు దాని కోసమే ఎగబడుతున్నారు.

Murari

- Advertisement -

ఇకపోతే మురారి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను కృష్ణవంశీ తీసిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ బాబు కెరియర్ బిగ్గెస్ట్ హిట్స్ లో మురారి సినిమా ఒకటి. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలను ఇప్పుడు వింటున్న కూడా ఒక రకమైన ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాను అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఆదరించారు. అయితే ఇప్పట్లో థియేటర్ కి ఆడియన్స్ రావడం మానేశారు. ఇంకా మురారి సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనుకున్న తరుణంలో ఒక మంచి సినిమాకి ఎటువంటి ఆదరణ లభిస్తుందని మరోసారి ఈ సినిమాకు బుక్ అయిన టికెట్లు ప్రూవ్ చేశాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు