Chinmayi – Allu Arha : అల్లు అర్హ బుగ్గ గిల్లడంపై చిన్మయి రియాక్షన్.. ఇలా అనేసిందేంటి?

Chinmayi – Allu Arha : అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, కూతురు అల్లు అర్హ నిన్న తిరుమలలో సందడి చేసిన సంగతి తెలిసిందే.. తిరుమల వెంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అయితే స్నేహారెడ్డి దర్శనం అనంతరం అర్హను, అయాన్‌ను తీసుకుని బయటకు వచ్చారు. అలా బయటకు వచ్చే టైంలో ఓ వ్యక్తి అర్హను బుగ్గలను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అర్హ అతన్ని పట్టుకొనివ్వకుండా పక్కకు ముఖం తిప్పుకుంది.. అతడి చేతిని విసిరి కొట్టేసింది. అర్హ మొహంలోనే ఆ చిరాకు కనిపిస్తోంది. ఆ అయిష్టత స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై తాజాగా సింగర్ చిన్మయి స్పందించింది.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు స్నేహా రెడ్డి తిరుమలకు వెళ్తుందన్న సంగతి తెలిసిందే.. ఈమె నెలకు రెండు, మూడు సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంది. నిన్న వెళ్లిన కూడా తన పిల్లలను తీసుకోని తిరుమలకు వెళ్లింది. ఈ క్రమంలో అల్లు అర్హకు చేదు అనుభవం ఎదురైంది. అర్హను చూసిన టీటీడీ సిబ్బంది ఒకతను అర్హ బుగ్గల్ని గిల్లే ప్రయత్నం చేశాడు. ఇక అర్హను ముద్దు పెట్టుకునే క్రమంలో అర్హ బుగ్గల్ని పట్టుకున్నాడు. కానీ అర్హ మాత్రం అతడి చేతిని విసిరికొట్టేసింది. అతని వల్ల ఇబ్బందిగా అర్హ ఫీల్ అయ్యినట్లు తెలుస్తుంది. ఆ ఘటనకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

Chinmayi's reaction to Allu Arha's cheek licking.. post viral
Chinmayi’s reaction to Allu Arha’s cheek licking.. post viral

ఈ వీడియో పై తాజాగా సింగర్ చిన్మయి స్పందించింది. గత కొన్ని రోజులుగా ఇలాంటి విషయాల పై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. సొంత కూతురైనా సరే.. సొంత తండ్రైనా సరే.. పాపకు ఇష్టం లేకుండా ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి చేయొద్దంటూ చిన్మయి చెప్పిన మాటలతో ఒక్కసారిగా ఆమె మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. పిల్లలు తినరని మారాం చేస్తారు.. అప్పుడు కూడా వాళ్లని బలవంత పెట్టొద్దా? , స్కూల్‌కి వెళ్లమని గొడవ చేస్తారు అప్పుడు కూడా బలవంతం చేయొద్దా? అంటూ ఇలా అర్థం లేని వాదన తో చిన్మయిని ట్రోల్ చేస్తూ వచ్చారు.. అయితే ఇప్పుడు అర్హ విషయం పై చిన్మయి ప్రత్యేకంగా స్పందించింది. పిల్లలకు ఇష్టం లేదనేది మోహంలో బాగా కనిపిస్తుంది. మొహం చూస్తే తెలుస్తుంది.. కనీసం వేరే వాళ్ల పిల్లల్ని అయినా అలా టచ్ చేయకుండా ఉండండి అని చిన్మయి కోరింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. ఇక ఈ విషయం పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. ఇష్టం లేకుంటే వదిలెయ్యాలి కానీ అలా చెయ్యడం ఏంటంటే మండిపడుతున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది..

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు