Akash Puri: ఇచట డిజాస్టర్ స్క్రిప్ట్స్ ఎంచుకోబడును

Akash Puri: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పూరి జగన్నాథ్ తీసే సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. పూరి జగన్నాథ్ హీరో క్యారెక్టర్ ను చాలా బాగా రాస్తాడు దాని కోసమైనా సినిమాకి వెళ్లాలి అంటూ డిసైడ్ అయిన ఆడియన్స్ చాలా మంది ఉండేవాళ్ళు. అలానే రవితేజ,పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ , ప్రభాస్ వంటి హీరోల అందరితో కూడా సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకున్నాడు. పూరి పీక్లో ఉన్న టైంలో తన కొడుకు ఆకాష్ పూరి పూరి సినిమాల్లో కనిపిస్తూ ఉండేవాడు.

చిన్న చిన్న సినిమాల్లో పాత్రలను పోషించిన ఆకాష్. ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన ధోని సినిమాతో మంచి గుర్తింపును పొందుకున్నాడు. ఆ తర్వాత ఆంధ్ర పోరి అనే సినిమాను కూడా చేశాడు. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెహబూబా అనే సినిమాకు పనిచేశాడు ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఆ తర్వాత రొమాంటిక్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు ఆకాష్ ఆ సినిమా కూడా డిజాస్టర్.

Aay Movie

- Advertisement -

జార్జి రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్న జీవన్ రెడ్డి దర్శకత్వంలో చోర్ బజార్ అనే సినిమాలో కనిపించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఆకాష్ మంచి టాలెంట్ ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ స్క్రిప్ట్ సెలక్షన్స్ లో ఆకాష్ చాలా పూర్ అని చెప్పాలి. సరైన కథను ఎన్నుకోవడంలో తడబడుతున్నాడు. ఇక ఆగస్టు 15న ఆయ్ అనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఆ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా గురించి పాజిటివ్ టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ గా ఆకాష్ అనుకున్నారట. కానీ ఆకాష్ ఈ కథను రిజెక్ట్ చేశాడట. ఇకపోతే ఈ సినిమా రిజల్ట్ పాజిటివ్ గా వస్తున్న తరుణంలో ఆకాష్ అన్ని రిజెక్టెడ్ కథలను ఎంచుకుంటున్నాడు అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

చోర్ బజార్ అనే సినిమా తర్వాత ఇప్పటివరకు ఆకాష్ ఒక సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. ఆకాష్ నుంచి సినిమా వస్తే చూడడానికి చాలామంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఒక నటుడుగా ఆకాష్ ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఒక సరైన హిట్ సినిమా ఇప్పటివరకు ఆకాష్ కెరియర్ లో పడకపోవడం అనేది బాధాకరమైన విషయం అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు