Taapsee: హీరోయిన్ తాప్సి లైఫ్ లో కుడా లవ్ ఫెయిల్యూర్ ఉందా..?

Taapsee:తెలుగు సినీ పరిశ్రమ లో గతంలో ఎన్నో చిత్రాలలో ఎక్కువగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ తాప్సీ పన్ను. మొదట డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం చిత్రంతో తన సినీ కెరియర్ మొదలయ్యింది. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. తెలుగులో అడపా దడపా సినిమాలు చేసిన తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ పలు చిత్రాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వివాహం చేసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం పైన ఈమె క్లారిటీ ఇవ్వలేదు.

Taapsee: Is there any love failure in heroine Taapsee's life?
Taapsee: Is there any love failure in heroine Taapsee’s life?

ఆ హీరోని ప్రేమించిన తాప్సీ..

బాలీవుడ్ లో బడా ప్రాజెక్టులు సైతం అందుకుంటున్న తాప్సి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. ఎలాంటి విషయాన్నైనా సరే ముక్కు సూటిగానే తెలియజేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాప్సి కి సంబంధించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు తాజాగా వైరల్ గా మారుతున్నది. తాప్సి గతంలో ఒక హీరోతో ప్రేమలో పడిందట. కానీ చివరికి ఆ హీరోకి రాఖీ కట్టే పరిస్థితి ఎదురైందనే విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నది. మరి ఆ హీరో ఎవరో కాదు మంచు మనోజ్.

మనోజ్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తాప్సీ..

గతంలో కూడా వీరిద్దరి మధ్య అనేక రూమర్స్ వినిపించాయి. వీరు వివాహం కూడా చేసుకోవాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత విడిపోయారని వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. అయితే ఈ విషయం పైన ఒకానొక సందర్భంలో తాప్సి మాట్లాడుతూ.. మనోజ్ ను తాను అసలు ప్రేమించలేదని, ఎవరో తన మీద కావాలని ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేశారని, ఈ నింద తన మీద పోవాలి అంటే కచ్చితంగా మనోజ్ కి తాను రాఖీ కట్టాలని ఆరోజు నిర్ణయించుకుందట. అందుకే మనోజ్ కి సైతం రాఖీ కట్టాను అంటూ తెలిపింది.

- Advertisement -

ఝుమ్మంది నాదం మూవీ నుంచి మొదలైన రూమర్స్..

అప్పటినుంచి ఈ రూమర్స్ కి కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మరి హీరోయిన్ తాప్సి మీద కావాలని సృష్టించిన ఆ రూమర్ ఎవరా అంటూ అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు. ఇకపోతే మంచు మనోజ్ తాప్సి ఇద్దరు కలిసి ఝుమ్మంది నాదం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి కెమిస్ట్రీ కూడా తెరపై చాలా బాగా పండింది అందుకే వీరిద్దరిపై ఇలాంటి రూమర్స్ వినిపించి ఉండవచ్చు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు

తెలుగు పరిశ్రమను విమర్శించిన తాప్సీ..

ఇదిలా ఉండగా ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ తాప్సీకి ఎన్నో అవకాశాలు కల్పించింది. ఆమెకు ఉన్నత అవకాశాన్ని అందించింది. అయితే ఆమె మాత్రం బాలీవుడ్లో అవకాశాలు అందుకొని అక్కడ భారీ పాపులారిటీ దక్కించుకున్న తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అక్కడే బిజీ హీరోయిన్గా మారిపోయింది తాప్సీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు